ETV Bharat / sports

కోహ్లీని కెప్టెన్​గా తప్పించాలనడం సరికాదు: సెహ్వాగ్

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలనడం సరికాదని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. అది సరైనా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డాడు. జట్టు మెరుగుపడేలా మార్పులు చేయాలని ఫ్రాంచైజీకి సూచించాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Nov 8, 2020, 10:03 AM IST

Updated : Nov 8, 2020, 11:25 AM IST

ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి కప్పు గెలవకుండానే​ ఇంటిముఖం పట్టింది. దీంతో జట్టు సారథి కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెటర్లు​ గంభీర్​, సంజయ్​ మంజ్రేకర్​ సహా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్​.. విరాట్​కు మద్దతుగా నిలిచాడు. సారథి బాధ్యతలు నుంచి అతడిని తప్పించాలనడం సరైన పరిష్కారం కాదని అన్నాడు.

"కోహ్లీని సారథిగా తప్పించాలని ఆలోచించడం సరైన పరిష్కారం కాదు. జట్టును దృఢంగా తయారుచేయడానికి మార్పులు చేసే దిశగా ఫ్రాంచైజీ ఆలోచించడం మంచిది. ఓ జట్టుకు మంచి నాయకుడు ఉండటమనేది చాలా ముఖ్యం. కాబట్టి మేనేజ్​మెంట్​ కోహ్లీని పక్కనపెట్టదని నా అభిప్రాయం. ప్రతిజట్టుకు స్థిరమైన బ్యాటింగ్​ ఆర్డర్​ ఉంది. కానీ ఆర్సీబీకి మాత్రం లేదు. బ్యాటింగ్​ ఆర్డర్​లో విరాట్​, ఏబీ డివిలియర్స్​ పైకి కిందకి మారుస్తూ వారి పైనే ఆధారపడుతోంది. టాప్​ఆర్డర్​లో పడిక్కల్ కూడా బాగా రాణిస్తున్నాడు. అయితే అతడితో పాటు మరో మంచి ఓపెనర్​, లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ జట్టుకు అవసరం. ఈ ఐదుగురు ఉంటే చాలు జట్టు మ్యాచ్​లను అవలీలగా గెలుస్తుంది. మన భారత మీద బౌలర్లపైన నమ్మకం ఉంచి వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ ఫ్రాంచైజీ మాత్రం కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీయదు. కాకపోతే కొన్ని మార్పులు చేస్తుంది. జోస్​ ఫిలిప్పి, ఉమేశ్​ యాదవ్​ లాంటి ఆటగాళ్లను వేలంపాటలో పెట్టి ఇద్దరు కొత్త ఓపెనర్లు, పేసర్లను తీసుకోవచ్చు"

-సెహ్వాగ్​, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​

శుక్రవారం రాత్రి ఎలిమినేటర్​ మ్యాచ్​ పూర్తవగానే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కొత్త బయోబడుగలోకి కోహ్లీ అడుగుపెట్టాడు. నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆసీస్​-భారత్​ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చూడండి:

Last Updated : Nov 8, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.