రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు సంతోషం తెప్పించే విషయం ఇది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. ఆదివారం(అక్టోబరు 4) యూఏఈకి రానున్నాడు. అనంతరం ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారి వెల్లడించారు. స్టోక్స్ విమానంలో ఉన్న ఫొటోను కూడా రాజస్థాన్ జట్టు ట్వీట్ చేసింది.
ఆగస్టులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా స్టోక్స్ తప్పుకున్నాడు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. న్యూజిలాండ్‌లో ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం యూఏఈకి తిరిగొస్తున్నాడు.