సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రమాదకర జట్టు అయినా సరే క్వాలిఫయర్-2లో తమ జట్టే గెలుస్తుందని దిల్లీ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ధీమా వ్యక్తం చేశాడు. అబుదాబి వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
"ఈ సీజన్లో హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోంది. అలానే ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చారు. గత మ్యాచ్‌లోనూ వాళ్లు అదరగొట్టారు. మంచి బ్యాట్స్‌మెన్, ప్రమాదకర బౌలర్లు సన్‌రైజర్స్ జట్టులో ఉన్నారు. వాళ్లతో పోటీ అంటే రసవత్తరంగా ఉంటుంది. రషీద్ ఖాన్ గొప్ప బౌలర్. టాప్ఆర్డర్లో డేవిడ్ వార్నర్, విలియమ్సన్ ఎన్నోసార్లు ఆ జట్టును ఆదుకున్నారు. వాళ్లు ప్రమాదకరంగా కనిపించొచ్చు కానీ గెలిచేది మేమే"
-- మార్కస్ స్టోయినిస్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు
ఈ సీజన్లో ఇప్పటివరకు 314 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు తీశాడు స్టోయినిస్. వ్యక్తిగత పరుగుల కంటే, జట్టు గెలుపుపైనే తాను దృష్టిపెడతానని ఇతడు అన్నాడు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాసరే తాము అందుకు తగ్గట్లుగా ఆడతామని చెప్పాడు. ట్రోఫీ సాధించాలన్న లక్ష్యమే తమ జట్టుకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపాడు.
లీగ్ దశలోని రెండు మ్యాచ్‌ల్లోనూ దిల్లీపై హైదరాబాద్ విజయం సాధించింది. చివరి ఆరు మ్యాచ్‌ల్లో దిల్లీ ఒకే ఒక్క విజయం సాధించగా.. హైదరాబాద్ ఒక్క దాంట్లో మాత్రమే ఓడింది.
ఇదీ చూడండి:దిల్లీ vs హైదరాబాద్: ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?