ఈసారి ఐపీఎల్ రాజస్థాన్‌కు కలిసిరానట్టుంది. కీలక ఆటగాళ్లు ఆ జట్టు నుంచి వరుసగా దూరమవుతూనే ఉన్నారు. దీంతో టోర్నీలో ఒక్కమ్యాచ్ కూడా ఆడకముందే అపశకునాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్.. తన కుటుంబ కారణాల వల్ల లీగ్‌కు దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు జట్టులో చేరతాడో లేదో యాజమాన్యానికే తెలియని పరిస్థితి.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. రాజస్థాన్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ గాయపడ్డాడు. ఇంతవరకూ కోలుకోలేదు. అయితే, స్మిత్ తొలి మ్యాచ్‌కు మాత్రమే దూరం కానున్నాడట. తర్వాత నుంచి అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాజస్థాన్ ఈనెల 22న చెన్నైతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరమైన విషయమే.