ETV Bharat / sports

షారుక్​​ డైలాగ్​కు మురిసిన రాహుల్​ త్రిపాఠి - shahrukh khan dialogue about rahul tripathi

చెన్నై సూపర్​కింగ్స్​పై కోల్​కతా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్​ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు కేకేఆర్​ యజమాని షారుక్​ ఖాన్​. స్టేడియంలోని స్టాండ్స్​లో​ కూర్చుని మ్యాచ్​ను తిలకించిన షారుక్​​.. రాహుల్​ త్రిపాఠిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్​ చెప్పాడు. ప్రేక్షకులను ఈ డైలాగ్​ విపరీతంగా ఆక్టటుకుంటోంది.

Shah Rukh Khan Shouts His Iconic Dialogue From Stands Rahul Tripathi Bursts Into Laughter
షారుఖ్​ డైలాగ్​కు మురిసిన రాహుల్​ త్రిపాఠి
author img

By

Published : Oct 8, 2020, 5:32 PM IST

కోల్‌కతా యజమాని షారుక్​ ఖాన్‌ తన జట్టు ఆడే మ్యాచులకు స్వయంగా వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. జట్టు సభ్యులు తమ బాస్‌ను సంతోషపెట్టేందుకు మరింత కష్టపడి మ్యాచ్‌లు గెలిపించే ప్రయత్నం చేస్తుంటారు. బుధవారం రాత్రి అబుదాబి వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌ చూసేందుకు షారుక్​ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా పది పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత షారుఖ్‌ స్టాండ్స్‌లో ఉండి మైదానంలో నవ్వులు పూయించాడు.

కోల్‌కతా ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి 80(51బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు)పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఆ అవార్డు అందుకునే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న కోల్‌కతా యజమాని‌ షారుక్​.. త్రిపాఠిని ఉద్దేశిస్తూ 'రాహుల్‌ నామ్‌ తో సునా హోగా' డైలాగ్‌ గట్టిగా చెప్పాడు. తమ ఓనర్‌ ఆనందాన్ని చూసిన త్రిపాఠి ముసిముసిగా నవ్వుతూ అవార్డు తీసుకున్నాడు. షారుక్​ హీరోగా నటించిన 'దిల్‌ తో పాగల్‌ హై' సినిమాలోనిదీ డైలాగ్. 'ఏ సినిమాలో హీరోగా రాహుల్‌ ఉంటే.. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది' అని కోల్‌కతా జట్టు ట్వీట్‌ చేసింది. 'కచ్చితంగా' అంటూ షారుక్​ దాన్ని రీట్వీట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.