ETV Bharat / sports

శుభ్​మన్​ ఫీల్డింగ్​కు సారా తెందూల్కర్​ ఫిదా - సారా శుభ్​మన్ వార్తలు

భారత యువ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​, సచిన్​ కుమార్తె సారా తెందూల్కర్​ల మధ్య ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సారా పోస్ట్​ చేసిన ఫొటో ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది.

Sara Tendulkar's 'heart'felt reaction to Shubman Gill's fielding in IPL 2020
శుభ్​మన్​ ఫీల్డింగ్​కు సారా తెందూల్కర్​ ఫిదా
author img

By

Published : Oct 1, 2020, 5:37 PM IST

టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​.. సచిన్​ కుమార్తె సారా తెందూల్కర్​ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నెట్టింట విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్​లో ఉన్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. అయితే శుభ్​మన్​పై ఇటీవలే సారా చేసిన ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​ దీనికి మరింత బలాన్నిచ్చింది. ప్రస్తుత ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న శుభ్​మన్​ గిల్​.. సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాజస్థాన్​ రాయల్స్​పై జరిగిన మ్యాచ్​ల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో క్రికెట్​ అభిమానుల నుంచే కాకుండా సారా తెందూల్కర్​ నుంచి ప్రశంసలను అందుకున్నాడు.

అనేక సందర్భాల్లోనూ శుభ్​మన్​ గిల్​, సారా​లు సోషల్​మీడియా కామెంట్​ బాక్స్​ల్లో సంభాషించుకోవడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందన్న ప్రచారం మరింత పెరిగింది.

కాగా ప్రస్తుత ఐపీఎల్​లో ముంబయి, కోల్​కతా మధ్య జరిగిన మ్యాచ్​ గురించి సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ చేసింది సారా. అది కాస్త వైరల్​గా మారింది. అయితే ఈ మ్యాచ్​లో కేకేఆర్​ ఓడిపోయినప్పటికీ.. ఫీల్డింగ్​లో శుభ్​మన్​ గిల్​ అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్​కు సంబంధించిన శుభ్​మన్​ గిల్​ ఫొటోను సారా తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో పోస్ట్​ చేస్తూ.. దానికి హార్ట్​ ఎమోజీలను జతచేసింది. దీనిపై సోషల్​మీడియాలో రకరకాల ఊహాగానాలు పెరిగిపోయాయి. వీరిద్దరి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.