టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ గాయం గురించి ముంబయి ఇండియన్స్ ప్రకటన విడుదల చేయాలని మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు. రోహిత్ గాయం విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని సూచించాడు.
"నేను ఆడే రోజుల్లో శ్రీకాంత్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్. సెలెక్షన్ రోజు ఆటగాడు గాయపడితే అతడిని ఎంపిక చేసేవారు కాదు. అయితే ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియాది సుదీర్ఘ పర్యటన. రోహిత్ కీలక ఆటగాడు. ఈ రోజు గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయకపోతే రోహిత్ పట్ల కఠినంగా వ్యవహరించినట్లే. అతడి గాయం స్వభావమేంటో నాక్కూడా తెలియదు. దీన్ని మీడియా ప్రశ్నించాలి. రోహిత్ అనారోగ్యంగా ఉన్నాడని మొదట చెప్పారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి స్టేడియంలో ఏం చేస్తున్నాడు? ఆ ఆటగాడికి విశ్రాంతినిస్తే వీలైనంత త్వరగా కోలుకుంటాడు. రోహిత్ గాయం స్వభావమేంటో ఫ్రాంచైజీ ప్రకటన విడుదల చేయాలి."
-వీరేందర్ సెహ్వాగ్
రోహిత్ శర్మ కూడా తన ఆరోగ్య పరిస్థితి గురించి సామాజిక మాధ్యమ వేదిక ద్వారా వివరించొచ్చు అన్నారు సెహ్వాగ్.