శనివారం రాత్రి హైదరాబాద్ చేతిలో ఘోర పరాభవం చెందిన బెంగళూరు తన చివరి మ్యాచ్‌లో సోమవారం దిల్లీని ఢీకొనబోతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. అసలైన వినోదం నిజమైన ఛాలెంజ్‌లో ఉంటుందని ట్వీట్ చేశాడు. దాన్ని బెంగళూరు టీమ్ కూడా రీట్వీట్ చేసి ఇలా పేర్కొంది.
-
Real fun is in a real challenge. 🕘 @RCBTweets pic.twitter.com/jtRin39Z7N
— Virat Kohli (@imVkohli) November 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Real fun is in a real challenge. 🕘 @RCBTweets pic.twitter.com/jtRin39Z7N
— Virat Kohli (@imVkohli) November 1, 2020Real fun is in a real challenge. 🕘 @RCBTweets pic.twitter.com/jtRin39Z7N
— Virat Kohli (@imVkohli) November 1, 2020
"ఛాలెంజ్ స్వీకరించినట్లు కెప్టెన్ చెప్పాడంటే.. మనం వెనక కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిద్దాం" అని రీట్వీట్ చేసింది. చివరి మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినా.. బెంగళూరు ప్రస్తుతం 14 పాయింట్లతో కొనసాగుతోంది. దిల్లీ కూడా 14 పాయింట్లతోనే ఉండగా, గత నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు కోసం తహతహలాడుతున్నాయి.