ఐపీఎల్ 13వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ బెర్తుల కోసం మూడు స్థానాలు దాదాపు ఖరారు కాగా.. మరో ప్లేస్ కోసం పోటీ కొనసాగుతోంది. అలాగే ఆరెెంజ్, పర్పుల్ క్యాప్ కోసం పోటీ మరింత ఆసక్తిగా తయారైంది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రాహుల్ వద్ద ఉండగా.. రబాడ పర్పుల్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు.
ఆరెంజ్ క్యాప్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ 540 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఇతడికి పోటీగా దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ 464 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత పంజాబ్ మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్ 398 రన్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు.
పర్పుల్ క్యాప్
దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ తన వద్ద ఉంచుకున్నాడు. తర్వాత ముంబయి ఇండియన్స్ పేసర్ బుమ్రా 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అతడి సహచర ఆటగాడు బౌల్ట్ 16, షమీ 16, చాహల్ 15 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టాప్‌లో ముంబయి
పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. దిల్లీ, బెంగళూరు కూడా 14 పాయింట్లతో ఉన్నా రన్‌రేట్ పరంగా ముంబయి ముందుంది.