ETV Bharat / sports

జీరో నుంచి హీరో.. రాహుల్ తెవాతియా జర్నీ

కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​తో ఒక్కసారిగా హీరో అయిపోయాడు యువ ఆటగాడు రాహుల్ తెవాతియా. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది రాజస్థాన్​ రాయల్స్​ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఇతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముచ్చటించిన రాహుల్ కుటుంబం తమ సంతోషాన్ని పంచుకుంది.

author img

By

Published : Sep 29, 2020, 1:50 PM IST

Rags to riches: The story of IPL's new star Rahul Tewatia
జీరో నుంచి హీరో.. రాహుల్ తెవాతియా జర్నీ

ఎదురుగా కొండంత లక్ష్యం.. అంతగా అనుభవం లేని ఓ కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడితో బంతికి బ్యాట్‌ను కూడా తాకించలేక అవస్థలు పడ్డాడు. అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. హిట్టర్‌ ఉతప్పను కాదని అతడిని ముందుగా బ్యాటింగ్‌కు పంపించిన స్మిత్ నిర్ణయంపై అభిమానులంతా అసహనానికి గురయ్యారు. అయితే అదంతా కొద్దిసేపే. తర్వాతే అసలు కథ మొదలైంది. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. అతడి విధ్వంసం చూసి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అంతే.. ఒక్కసారిగా విలన్‌ హీరోగా మారిపోయాడు. అతడే రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్ తెవాతియా. కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో జీరో నుంచి హీరోగా మారిపోయాడు. మాజీలు, ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇతడి ప్రదర్శన గురించి తన ఫ్యామిలీ ఏమంటుందో చూద్దాం.

రాహుల్ తెవాతియా ఫ్యామిలీ

"నా కొడుకు ఇంత బాగా ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి రాహుల్ చాలా కష్టపడ్డాడు. తను మొదట్లో బంతిని ఆడేటపుడు ఇబ్బంది పడ్డ సమయంలో ఇంట్లో మేము చాలా ఒత్తిడికి గురయ్యాం. కానీ చివర్లో అతడి ప్రదర్శనతో అందరం ఎగిరి గంతేశాం. రాహుల్ టీమ్​ఇండియాకు ఆడితే చూడాలని ఉంది" అంటూ రాహుల్ తల్లి ప్రేమ్ తెవాతియా తెలిపారు.

చిన్నప్పట్నుంటి క్రికెట్ అంటే ఇష్టం

రాహుల్ తెవాతియా హరియాణాలోని ఫరిదాబాద్ జిల్లాలోని సిహి అనే గ్రామంలో 1993లో జన్మించాడు. అతడి తండ్రి కృష్ణ పాల్‌ లాయర్‌గా పనిచేస్తున్నారు. అయితే తెవాతియా ఆటల్లోకి రావడానికి ప్రధాన కారణం తన తాతయ్య, మామయ్య. అతడి తాతయ్య వ్యవసాయంతో పాటు కుస్తీల్లో పాల్గొనేవారు. దీంతో మనవడ్ని పహిల్వాన్‌ చేయాలనుకున్నాడు. అతడి మామయ్య హాకీ ప్లేయర్‌, దీంతో అల్లుడ్ని హాకీ ఆడించాలనుకున్నాడు. కానీ తెవాతియా మాత్రం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో అతడిని కృషన్‌ పాల్‌.. విజయ్ యాదవ్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్చారు. విజయ్‌ యాదవ్ దగ్గరే తెవాతియా క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్నాడు. భారత మాజీ వికెట్‌కీపర్‌ విజయ్‌ యాదవ్ క్రికెట్‌ అభిమానులకి సుపరిచితమే.

Rags to riches: The story of IPL's new star Rahul Tewatia
రాహుల్ తెవాతియా ఫ్యామిలీ

రంజీల్లో అరంగేట్రం

తెవాతియా హరియాణా తరఫున 2013-14 సీజన్​లో రంజీల్లో అరంగేట్రం చేశాడు. అలాగే అదే రాష్ట్రం తరఫున 2016-17లో లిస్ట్-ఏ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు.

తెవాతియా లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్ కెరీర్‌ను‌ ఆరంభించాడు. కానీ హరియాణా రంజీ జట్టులో ప్రముఖ లెగ్ స్పిన్నర్లు చాహల్, అమిత్ మిశ్రా ఉండటం వల్ల.. తనకంటూ ప్రత్యేకత ఉండాలని కోచ్‌ సలహాతో బ్యాటింగ్‌లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. క్రమంగా మంచి హిట్టర్‌గా మారాడు. ఫస్ట్‌ క్లాస్, లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన ఇచ్చాడు. 21 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 484 పరుగులతో పాటు 27 వికెట్లు సాధించాడు. అలాగే 7 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 190 పరుగులు, 17 వికెట్లు తీశాడు. తెవాతియా కుడిచేతి వాటం బౌలర్‌, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌.

రాహుల్ తెవాతియా

మళ్లీ రాజస్థాన్​కే

లీగ్‌లో తొలుత రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన తెవాతియా తర్వాత పంజాబ్‌, దిల్లీ జట్ల తరఫున ఆడాడు. గత సీజన్‌లో దిల్లీ జట్టులో ఉన్న అతడు ఈ సీజన్‌లో రాజస్థాన్‌ జట్టుకు వచ్చాడు. బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె కోసం దిల్లీ తెవాతియాను వదులుకుంది. దీంతో అతడు తిరిగి రాజస్థాన్‌ జట్టులో చేరాడు.

2014 నుంచి అతడు లీగ్‌ ఆడుతున్నా ఈ సీజన్‌లోనే సత్తాచాటుతున్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరవకపోయినా బంతితో రాణించాడు. షేన్ వాట్సన్‌, సామ్‌ కరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ను పెవిలియన్‌కు చేర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అతడి ఊచకోత ఇక తెలిసిందే. లీగ్‌లో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన అతడు 174 పరుగులు చేసి 17 వికెట్లు తీశాడు. పంజాబ్‌పై చేసిన 53 పరుగులే అత్యధిక స్కోరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.