ETV Bharat / sports

పంజాబ్​ 'డబుల్​ సూపర్'​.. ముంబయి డీలా - ఐపీఎల్​ 13 లైవ్​ స్కోర్​

దుబాయ్​ వేదికగా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్​లో రెండో సూపర్​ఓవర్​లో ముంబయి ఇండియన్స్​పై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ విజయం సాధించింది. దీంతో వరుసు పరాజయాలను చవిచూస్తోన్న పంజాబ్​కు ఊరట లభించింది. దీంతో ఈ లీగ్​లో మూడో విజయాన్ని నమోదు చేసుకుని.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

punjab defeat mumbai in second super over
పంజాబ్​ 'డబుల్​ సూపర్'​.. ముంబయి డీలా
author img

By

Published : Oct 19, 2020, 12:40 AM IST

Updated : Oct 19, 2020, 8:26 AM IST

దుబాయ్​ వేదికగా ఉత్కంఠంగా సాగిన పోరు అభిమానులు కోరుకునే అసలైన మజా ఇచ్చింది. రెండో సూపర్​ ఓవర్​కు దారీ తీసిన ఈ మ్యాచ్​లో గెలుపు గుర్రంపై సవారీ చేస్తోన్న ముంబయికు కళ్లెం వేసింది పంజాబ్​. దీంతో వరుస ఓటములతో సతమతమయిన పంజాబ్​కు ఊరట లభించింది. ఫలితంగా ఈ లీగ్​లో మూడో విజయాన్ని నమోదు చేసింది.

తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను అయిదు పరుగు‌లకే కట్టడి చేశాడు. అనంతరం షమి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల ముంబయి సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అనంతరం మరో సూపర్‌ఓవర్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ లక్ష్యాన్ని మరో రెండు బంతులుండగానే ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు. లీగ్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఇదే.

అంతకుమందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) మెరిశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. దీంతో కేఎల్‌ రాహుల్ (77; 51 బంతుల్లో, 7×4, 3×6) గొప్పగా పోరాడాడు. ఆ జట్టును బుమ్రా (3/24) దెబ్బ తీశాడు.

ఛేదనకు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. మయాంక్‌ అగర్వాల్‌ (11)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గేల్‌ (24; 21 బంతుల్లో, 1×4; 2×6)తో కలిసి రాహుల్‌ దూకుడుగా ఆడటం వల్ల పవర్‌ప్లేలో 50 పరుగులు చేసింది. అయితే తర్వాత ధాటిగా ఆడలేకపోవడం వల్ల పంజాబ్ స్కోరు నెమ్మదించింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడే యత్నంలో గేల్‌ పెవిలియన్‌కు చేరాడు. అయితే తర్వాత క్రీజులో వచ్చిన పూరన్ బౌండరీల మోత మోగించడం వల్ల స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కానీ పూరన్‌, మాక్స్‌వెల్‌ను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి మ్యాచ్‌పై ముంబయి పట్టుబిగించింది. మరోవైపు రాహుల్ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. దీపక్‌ హుడా (23*; 16 బంతుల్లో, 1×4, 1×6) సహకారంతో క్రమంగా లక్ష్యాన్ని కరిగించాడు. కానీ బుమ్రా 148.5 కి.మీ/గ వేగంతో యార్కర్‌ను సంధించి రాహుల్‌ను క్లీన్‌బౌల్ట్‌ చేశాడు. అయితే కౌల్టర్‌నైల్‌ వేసిన 19వ ఓవర్‌లో జోర్డాన్ (13 బంతుల్లో, 2×4), హుడా చెరో బౌండరీ బాదడం వల్ల విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా.. జోర్డాన్‌ రెండో పరుగుకి ప్రయత్నించి రనౌటవ్వడం వల్ల మ్యాచ్ టైగా ముగిసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి పవర్‌ప్లేలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్ (0), ఇషాన్‌ కిషన్‌ (7) విఫలమయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (34; 30 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి ఓపెనర్‌ డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్‌ వెనుదిరిగాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న డికాక్‌ 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. అయితే హార్దిక్‌ పాండ్య (8)ను షమి, డికాక్‌ను జోర్డాన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించి ఆ జట్టును మరోసారి దెబ్బ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్డర్‌నైల్‌తో కలిసి పొలార్డ్‌ చెలరేగాడు. వీరిద్దరి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 54 పరుగులు వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు, జోర్డాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు.

Last Updated : Oct 19, 2020, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.