ETV Bharat / sports

తప్పుల్ని సరిదిద్దుకుని రాణిస్తాం: రోహిత్ - rohit sharma MI

తొలి మ్యాచ్​లో ఓటమి పొందినా చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్​లో రాణిస్తామని అన్నాడు ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ. బ్యాటింగ్​లో మంచి ఆరంభాన్ని అందుకున్నా.. పది ఓవర్ల తర్వాత చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు బౌలర్లు తమను అడ్డుకోవడంలో విజయం సాధించారని వెల్లడించాడు.

None of our batsmen carried on for us: Rohit
'రాయుడు, డుప్లెసిస్​లా ఆడే ఆటగాళ్లు మాకు లేరు'
author img

By

Published : Sep 20, 2020, 10:25 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​పై ముంబయి ఇండియన్స్​ పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మంచి ఆరంభం లభించింది. కానీ ఆ తర్వాత వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోవడం వల్ల అదే ఊపును చివరి వరకు కొనసాగించలేక పోయింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో మంచి రన్​రేట్​సాధించింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై సూపర్​కింగ్స్​ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంబటి రాయుడు (71), డుప్లెసిస్ (58) మంచి భాగస్వామ్యం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ​మ్యాచ్​ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తర్వాతి మ్యాచ్​లో తెలివిగా రాణిస్తామని తెలిపాడు.

None of our batsmen carried on for us: Rohit
ముంబయి ఇండియన్స్​

"డుప్లెసిస్​, రాయుడు లాగా మా బ్యాట్స్​మెన్​ ఎవరూ ఆడలేదు. మొదటి 10 ఓవర్లలో మేం 85 పరుగులు చేశాం. చివర్లో సీఎస్కే బౌలర్లు ఎంతో చక్కగా బౌలింగ్​ చేశారు. టోర్నీ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ మ్యాచ్​లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్​లో తెలివిగా రాణిస్తాం. పిచ్​లకు అనుగుణంగా మా జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది."

- రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​

స్టాండ్స్​లో అభిమానులు లేకుండా ఆడుతున్న అనుభూతి గురించి రోహిత్​ మాట్లాడుతూ.."ప్రేక్షకుల కేరింతల మధ్య ఆడటానికి అలవాటు పడ్డాం. కానీ, ప్రస్తుతం స్టేడియంలో వీక్షకులు లేరని తెలుసు. ఏమైనప్పటికీ.. ఇది కొత్తగా ఉంది. అయితే త్వరలోనే ఈ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నా" అని అన్నాడు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.