ETV Bharat / sports

'ధోనీలా ఆడే సాహసం ఎవరూ చేయలేరు'

తన బ్యాటింగ్​ను ధోనీతో పోల్చడాన్ని రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​ సున్నితంగా తిరస్కరించాడు. మహీలా ఆడే సాహసం ఎవరూ చేయలేరని అన్నాడు.

author img

By

Published : Sep 29, 2020, 10:12 PM IST

Sanju Samson
సంజూ శాంసన్

మహేంద్ర సింగ్​ ధోనీలా ఆడే సాహసం ఎవరూ చేయలేరని రాజస్థాన్​ రాయల్స్ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​ అన్నాడు. ఇటీవలే చెన్నై, పంజాబ్​లతో జరిగిన మ్యాచ్​ల్లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అతడిని అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ధోనీ అవుతాడని అతడికి ఎప్పుడో చెప్పానని ట్వీట్‌ చేశారు. అయితే, ​థరూర్ అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌తో పాటు శ్రీశాంత్ వ్యతిరేకించారు. శాంసన్​కు మరొకరిలా అవ్వాల్సిన అవసరం లేదని.. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్‌గానే ఉండాలని గౌతీ తెలిపాడు. తాజాగా సంజు ఈ విషయంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.

"ధోనీలా ఎవ్వరూ ఆడలేరు. అతనిలా ఆడేందుకు ఎవరూ ధైర్యం కూడా చేయరని అనుకుంటున్నా. మహీలా ఆడటం అంత సులువు కాదు. కాబట్టి, ఈ విషయాన్ని పక్కన పెట్టేయండి. అతను భారత క్రికెట్ లెజెండ్​. నా ఆటమీద మాత్రమే నేను దృష్టి సారిస్తా. అత్యుత్తమంగా ఎలా ఆడాలి.. ఎలా మ్యాచ్​ను గెలిపించాలి అనే కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తా."

-సంజూ శాంసన్​, రాజస్థాన్​ క్రికెటర్

రెండు మ్యాచ్​ల్లో 74, 85 పరుగులతో టీమ్​ఇండియా సెలక్షన్​ కమిటీ దృష్టిని ఆకర్షించాడు సంజు. "నేను ఆ విధంగా చేయొచ్చు, చేసుండకపోవచ్చు. కానీ నేను మంచి ఫామ్​లో ఉన్నా. నేను ఆడిన జట్టును గెలిపించడమే నా లక్ష్యం. అది ఏ జట్టైనా సరే. ప్రస్తుతం ఐపీఎల్​ మీద దృష్టి పెట్టా" అని సంజు పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.