టీ20 క్రికెట్ నిబంధనల్లో మార్పులేమి చేయాల్సిన అవసరంలేదని చెప్పాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. అయితే బౌలర్లకు మాత్రం ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశాన్ని క్రికెట్ నిర్వాహకులకు పరిశీలించాలని సూచించాడు. దీంతో బౌలర్లపై ఒత్తిడి కాస్త తగ్గుతుందన్నాడు.
"టీ20లో ఉన్న ప్రస్తుత నిబంధనలను సవరించాల్సిన అవసరమేమి లేదు. కానీ ఫాస్ట్ బౌలర్లకు మాత్రం ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం. బౌలర్ తన తొలి మూడు ఓవర్లలో ఓ వికెట్ తీస్తే అతడికి అదనంగా ఓ ఒవర్ వేసే అవకాశం ఇస్తే బాగుంటుంది."
-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
దీంతోపాటే బౌలర్ బంతిని వేసే ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాట్స్‌మన్ క్రీజును దాటుతున్నాడో లేడో టీవీ అంపైర్ తనిఖీ చేయాలన్నాడు. బ్యాట్స్‌మన్ అలా దాటుతున్నప్పుడు అతడిపై జరిమానా ఎందుకు విధించట్లేదని ప్రశ్నించాడు. అలాగే క్రీజు దాటిన బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసినప్పుడు మన్కడ్ బదులుగా బ్రౌన్ పేరును ఉచ్చరించాలని అన్నాడు.