ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ విజయాన్ని సాధించింది. ఈ గెలుపు సీఎస్కే కెప్టెన్ ధోనీకి ఓ రికార్డు తెచ్చిపెట్టింది. ఐపీఎల్ కెరీర్లో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకున్నాడు ధోనీ. అలాగే ఇదే మ్యాచ్‌లో వంద క్యాచ్‌లు పట్టిన మైలురాయిని దక్కించుకున్నాడు. మొత్తంగా టీ20ల్లో 250 ఔట్లలో పాలుపంచుకున్న తొలి వికెట్ కీపర్‌గానూ ఘనత వహించాడు.

ఏడాది తర్వాత
గతేడాది ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన ధోనీ.. 437 రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టాడు. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గొనడానికి యూఏఈకి బయలుదేరే ముందు.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
తొలి బంతికే ఔట్ అని..
శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కేవలం రెండు బంతులను ఎదుర్కొన్న ధోనీ ఎలాంటి పరుగులు నమోదు చేయలేదు. ఆడిన తొలి బంతికే అంపైర్ ఔట్ ఇవ్వగా.. రివ్యూ తీసుకుని నాటౌట్‌గా నిలిచాడు.
