ETV Bharat / sports

మనీశ్ ఖాతాలో మూడు వేల ఐపీఎల్ పరుగులు - మనీశ్​ పాండే 3 వేల రన్స్​

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్ మనీశ్​ పాండే హాఫ్​సెంచరీతో అలరించాడు. దీంతో ఐపీఎల్​లో 3 వేల పరుగులు చేసిన 16వ బ్యాట్స్​మన్​గా ఘనత వహించాడు. ​

Manish Pandey archives new milestone in IPL
మనీశ్​ పాండే
author img

By

Published : Oct 11, 2020, 8:47 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో అర్ధశతకం చేసి ఈ ఘనతను అందుకున్నాడు. టోర్నీలో 3 వేల రన్స్​ మైలురాయిని చేరిన ఆటగాళ్ల జాబితాలో 16వ క్రికెటర్​గా పాండే నిలిచాడు.

ఐపీఎల్​లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగానూ మనీశ్​కు​ పేరిట రికార్డుంది. 2009 సీజన్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ఆడిన పాండే.. 73 బంతుల్లో 114 పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో 43 సగటుతో 344 పరుగులు చేశాడు.

ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ ఉండగా.. సన్​రైజర్స్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.