రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమకు కఠినమైన ప్రత్యర్థి అని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్. శనివారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ అద్భుతంగా సాగుబోతుందని.. ఆర్సీబీతో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
-
Extra effort on the field calls for extra effort in recovery. 💆♂️
— Rajasthan Royals (@rajasthanroyals) October 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
P.S. We wish we had #Cryo at home! 🥶 #HallaBol | @CryoUAE | #Cryotherapy | #CryoUAE pic.twitter.com/BRg7PXo8J4
">Extra effort on the field calls for extra effort in recovery. 💆♂️
— Rajasthan Royals (@rajasthanroyals) October 2, 2020
P.S. We wish we had #Cryo at home! 🥶 #HallaBol | @CryoUAE | #Cryotherapy | #CryoUAE pic.twitter.com/BRg7PXo8J4Extra effort on the field calls for extra effort in recovery. 💆♂️
— Rajasthan Royals (@rajasthanroyals) October 2, 2020
P.S. We wish we had #Cryo at home! 🥶 #HallaBol | @CryoUAE | #Cryotherapy | #CryoUAE pic.twitter.com/BRg7PXo8J4
"ఆర్సీబీ మంచి జట్టుతో పాటు కఠినమైన ప్రత్యర్థి కూడా. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ మంచి ఆరంభాన్నిచ్చింది. ఇక మీదట కచ్చితంగా రాణిస్తారని భావిస్తున్నా. శనివారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ మ్యాచ్ బ్యాట్, బంతికి మధ్య గొప్ప పోటీగా నిలవనుంది. ఈ మ్యాచ్‌తో టోర్నీలో మా జట్టు మూడో విజయాన్ని నమోదు చేస్తుందని నమ్ముతున్నా".
- శ్రేయస్ గోపాల్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్
ఐపీఎల్లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇదే తొలి డే మ్యాచ్ కాబోతుంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో వేడి పెద్ద సమస్యగా మారడం సహా మంచు పడే అవకాశం కూడా ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఇప్పటివరకు టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను నమోదు చేసుకున్నాయి. మూడో గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు తగిన ప్రణాళికలను ఇరుజట్లు రచిస్తున్నాయి.