ETV Bharat / sports

ఉత్కంఠకర పోరు.. పంజాబ్​పై కోల్​కతా గెలుపు

author img

By

Published : Oct 10, 2020, 7:52 PM IST

ఐపీఎల్​లో పంజాబ్ జట్టు మరోసారి ఓడిపోయింది. కోల్​కతాపై 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, మయాంక్ శ్రమ వృథా అయిపోయింది.

Kolkata Knight Riders beat King XI Punjab by 2 runs
ఉత్కంఠకర పోరు.. పంజాబ్​పై కోల్​కతా గెలుపు

చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​పై కోల్​కతా నైట్​రైడర్స్ 2 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74), మయాంక్ అగర్వాల్(56) శ్రమ వృథా అయింది.

Kolkata Knight Riders beat King XI Punjab by 2 runs
పంజాబ్ ఓపెనర్లు మయాంక్-కేెఎల్ రాహుల్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్​కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58) ధనాధన్ ఇన్నింగ్స్​తో పాటు శుభ్​మన్(57) బ్యాట్​తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు మయాంక్-కేఎల్ రాహుల్.. తొలి వికెట్​కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 56 పరుగులు చేసి మయాంక్ ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​లో పూరన్ 16, సిమ్రన్ సింగ్ 4, మ్యాక్స్​వెల్ 10, మన్​దీప్ సింగ్ 0 పరుగులు చేశారు. కోల్​కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, నరైన్ 2 వికెట్లు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.