కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49పరుగులు తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. రోహిత్(80), సూర్యకుమార్ యాదవ్(47) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ట్రెంట్ బోల్ట్(2), జేమ్స్ ప్యాటిన్సన్(2), జస్ప్రిత్ బుమ్రా(2), రాహుల్ చాహర్(2), కీరన్ పొలార్డ్ (1) వికెట్ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది ముంబయి.
కోల్‌కతాపై ముంబయి అద్భుత విజయం - KKR vs MI playing 11
23:36 September 23
23:25 September 23
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి అంచున ఉంది. ఇప్పటికి ఏడు వికెట్లు కోల్పోయింది. 17.2 ఓవరుకు స్కోరు 118గా ఉంది.
22:54 September 23
కోల్‌కతా మరో వికెట్ కోల్పోయింది. పోలార్డ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు రానా(24). కోలకతా గెలవడానికి ఇంకా 50 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంది.
22:45 September 23
దినేశ్ కార్తీక్(30) ఔట్ అయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 10.1 ఓవర్ల సమయానికి కోల్‌కతా జట్టు స్కోరు 71/3
22:44 September 23
దినేశ్ కార్తిక్(30), రానా(24) నిలకడగా ఆడుతూ.. మెల్లగా స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్‌కతా జట్టు స్కోరు 71/2
22:17 September 23
ఓపెనర్లు ఔట్...
కోల్‌కతా ఓపెనర్లు ఔటయ్యారు. తొలుత గిల్, ఆ తర్వాత నరైన్(9) పెవిలియన్ చేరారు. 5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది.
22:04 September 23
కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు శుభ్‌మన్ గిల్(7). అనంతరం.. బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్ ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించాడు.
ప్రస్తుతం 3 ఓవర్లకు జట్టు స్కోరు 18/1.
21:57 September 23
తొలి ఓవర్ మెయిడిన్...
ముంబయి తరఫున తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ మెయిడిన్ వేశాడు. పరుగులు చేయడంలో శుభ్‌మన్ గిల్ చాలా ఇబ్బంది పడ్డాడు. 2 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది.
21:38 September 23
కోల్‌కతా లక్ష్యం 196
అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(80), సూర్యకుమార్ యాదవ్(47) అద్భుతంగా ఆడారు. కోలకతా బౌలర్లలో శివం మావి 2 వికెట్లు తీయగా.. నరైన్, రస్సెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
21:24 September 23
హార్దిక్ పాండ్య(18) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. 18.3 ఓవర్ల సమయానికి ముంబయి స్కోరు 180/5. క్రీజులో పోలార్డ్, కృనాల్ పాండ్య ఉన్నారు.
21:20 September 23
సెంచరీకి చేరువగా వచ్చి పెవిలియన్ బాటపట్టాడు రోహిత్(80). శివం మావి బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టగా.. కమిన్స్ క్యాచ్ పట్టాడు. 17.5 ఓవర్ల సమయానికి ముంబయి స్కోరు 177/4
21:00 September 23
ముంబయి మూడో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో సౌరభ్ తివారి (21) అవుట్ అయ్యాడు. 15.1 ఓవర్ల సమయానికి ముంబయి స్కోరు 147/3. క్రీజులో రోహిత్ శర్మ(71) కొనసాగుతున్నాడు.
20:37 September 23
రోహిత్ శర్మ అర్ధశతకం చేశాడు. ఓపెనర్‌గా దిగి 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, సౌరభ్ తివారీ ఉన్నారు. 12 ఓవర్ల సమయానికి ముంబయి స్కోరు 105/2.
20:28 September 23
సూర్య కుమార్ యాదవ్(47) ఔటయ్యాడు. అర్ధ శతకానికి చేరువలో వచ్చి రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు.
20:26 September 23
వన్‌డౌన్‌లో దిగిన సూర్యకుమార్ యాదవ్(45) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్(45)కూడా అదే జోరుతో కొనసాగుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి ముంబయి స్కోరు 94/1.
19:58 September 23
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి స్కోరు 48/1. సూర్యకుమార్(19), రోహిత్ శర్మ(26), నిలకడగా ఆడుతూ.. వికెట్ పడకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుత రన్ రేట్ 9.6గా ఉంది
19:38 September 23
ముంబయి ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. మావి బౌలింగ్‌లో క్వింటన్ భారీ షాట్ కొట్టగా.. నిఖిల్ నాయక్ క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఉన్నారు.
19:32 September 23
తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 8 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఉన్నారు.
19:18 September 23
కోల్‌కతా నైట్‌రైడర్స్ 2013 నుంచి వరుసగా తొలి మ్యాచ్‌లో గెలుస్తూ వస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో కూడా విజయ ఢంకా మోగిస్తుందేమో చూడాలి.
19:09 September 23
జట్ల వివరాలు
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పోలార్డ్, కృనాల్ పాండ్య, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్:సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, మోర్గాన్, ఆండ్రూ రసెల్, దినేశ్ కార్తిక్(కెప్టెన్, వికెట్ కీపర్), నిఖిల్ నాయక్, పాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి
19:01 September 23
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ గెలిచి ఘనంగా బోణీ కొట్టాలని కెప్టెన్ దినేశ్ కార్తిక్ భావిస్తున్నాడు.
18:37 September 23
గెలుపెవరిది?
అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. వీరిద్దరి మధ్య పోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. విజయం దక్కించుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ముంబయి జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తోంది. కోల్‌కతా కూడా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది.