ETV Bharat / sports

కోల్​కతా Vs బెంగళూరు: ఐదో విజయం కోసం పోరాటం

షార్జా వేదికగా నేడు జరగనున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​ల్లో గెలుపొందిన ఈ రెండు టీమ్​లు ఐదో విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

KKR fret over Narine's chucking complaint and Russell's fitness issues
కోల్​కతా Vs బెంగళూరు: ఐదో విజయం కోసం పోరాటం
author img

By

Published : Oct 12, 2020, 5:26 AM IST

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం షార్జా వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్​లు ఆడిన ఈ రెండు టీమ్​లు నాలుగు మ్యాచ్​లు గెలిచి ఐదో విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి.

కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టులో ఆండ్రూ రస్సెల్​ సరైన ఫామ్​లో లేడు. సునీల్​ నరైన్​ బౌలింగ్​పై బీసీసీఐకి ఫిర్యాదు అందడం వల్ల ఆ జట్టు మరింత చిక్కుల్లో పడినట్లైంది. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై జరిగిన మ్యాచ్​లో ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​, కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ మంచి ప్రదర్శన చేశారు. బౌలర్లలో ప్రసిద్ద్​ కృష్ణ, సునీల్​ నరైన్​ గత మ్యాచ్​లో బాగా రాణించారు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఓపెనర్లు దేవ్​దత్ పడిక్కల్​, ఆరోన్​ ఫించ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ.. కెప్టెన్ ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్​లో ఏబీ డివిలియర్స్​, ఆల్​రౌండర్లు వాషింగ్టన్​ సుందర్​, శివమ్ దూబె మంచి ఫామ్​లో ఉన్నారు. వీరితో పాటు సీఎస్కేతో జరిగిన మ్యాచ్​లో క్రిస్​ మోరిస్​ అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడి రాకతో బౌలింగ్​ లైనప్​ మరింత శక్తిమంతంగా మారింది. గత మ్యాచ్​ల్లోని తుది జట్లు అద్భుతంగా రాణించడం వల్ల ఈ మ్యాచ్​లో ఆటగాళ్లను దాదాపుగా మార్చే అవకాశం లేదు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య జరగనున్న మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్లు​:

కోల్​కతా నైట్​రైడర్స్​: దినేశ్​ కార్తిక్​ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), ఇయాన్​ మోర్గాన్​, శుభ్​మన్​ గిల్​, టామ్​ బాంటన్​, సునీల్​ నరైన్​, ఆండ్రూ రస్సెల్​, నితీశ్​ రానా, రాహుల్​ త్రిపాఠి, కుల్దీప్​ యాదవ్​, పాట్​ కమ్మిన్స్​, ప్రసిద్ద్​ కృష్ణ, ఫెర్గుసన్​, రింకు సింగ్​, కమలేశ్​ నాగర్​కోటి, శివమ్​ మావి, నిఖిల్​ నాయక్​, క్రిస్​ గ్రీన్​, ఓం సిద్ధార్థ్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, సిద్ధేష్ లాడ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, దేవదత్ పడిక్కల్​, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైని, డేల్ స్టెయిన్, పవన్ నేగి, ఇసురు ఉదానా, శివం దుబే, ఉమేశ్​ యాదవ్, గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, పవన్ దేశ్‌పాండే, ఆడం జంపా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.