ETV Bharat / sports

ఐపీఎల్​: ఆర్చర్ విధ్వంసం.. 2 బంతుల్లో 27 పరుగులు

author img

By

Published : Sep 23, 2020, 7:39 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​లో అద్భుతమైన ఓవర్​ సాగింది. చివరి ఓవర్​లో కేవలం రెండు బంతుల్లోనే 27 పరుగులను సమర్పించుకున్నాడు చెన్నై బౌలర్​ ఎంగిడి. అదేలా సాధ్యమైందో చూడండి.

Jofra Archer Hits 4 Sixes In 2 Balls, Smashes Lungi Ngidi For 30 Runs In The Final Over
ఐపీఎల్​: ఆర్చర్ విధ్వంసం.. 2 బంతుల్లో 27 పరుగులు

క్రికెట్లో సాధారణంగా ఒక బంతికి చేయగల గరిష్ట పరుగులు 6. ఆ లెక్కన రెండు బంతులకు 12 పరుగులు చేయొచ్చు. అయితే మంగళవారం చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ మాత్రం 2 బంతుల్లో ఏకంగా 27 పరుగులు చేసింది. ఈ అద్భుతం ఆర్చర్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌, ఎంగిడి పేలవ బౌలింగ్‌ వల్ల సాధ్యమైంది. 19వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఆర్చర్‌కు ఎంగిడి వేసిన చివరి ఓవర్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది.

ఎదుర్కొన్న తొలి బంతినే అతను బౌలర్‌ తలమీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి మరింతగా శక్తిని ప్రయోగించిన ఆర్చర్‌.. మిడ్‌వికెట్‌లో స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టాడు. దీంతో ఒత్తిడికి గురైన ఎంగిడి మరో పేలవ బంతి వేశాడు. ఈసారి మిడ్‌వికెట్‌, లాంగాన్‌ మధ్య ఫ్లాట్‌ సిక్సర్‌ అందుకున్నాడు ఆర్చర్‌. ఇది నోబాల్‌ కూడా కావడంతో ఫ్రీహిట్‌ వచ్చింది. బౌలర్‌ తల మీదుగా మరో సిక్సర్‌ బాదేశాడు. ఇది కూడా నోబాలే కావడంతో మళ్లీ ఫ్రీహిట్‌ వచ్చింది. తర్వాత వైడ్‌ వేయడంతో ఫ్రీహిట్‌ కొనసాగింది. చివరికి డాట్‌ బాల్‌ వేసి బయటపడ్డాడు. అంటే అధికారికంగా మూడో బంతి పడటానికి ముందే.. ఈ ఓవర్లో 27 పరుగులు (6, 6, 6+1, 6+1, 1) వచ్చాయి. చివరి 4 బంతుల్లో మూడే పరుగులు ఇవ్వడం ద్వారా ఎంగిడి ఈ ఓవర్లో 30 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.