రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన ఎంఎస్ ధోనీకి చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అండగా నిలిచాడు. అతడిలోని అత్యుత్తమ ఫినిషర్‌ను చూసేందుకు మరికాస్త సమయం పడుతుందని చెప్పాడు. ఏటా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని పేర్కొన్నాడు.
స్మిత్‌సేన నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో మహీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. యువకులైన సామ్ కరణ్, రుత్‌రాజ్‌ను ముందుగా ఆడించాడు. 14వ ఓవర్లో ధోనీ వచ్చినప్పటికీ 19వ ఓవర్ వరకు సింగిల్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు బాదినా అప్పటికే ఆలస్యమైపోయింది. ధోనీ 17 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ముగిశాక 14 రోజుల క్వారంటైన్ వల్ల సరైన సాధన చేయలేకపోయానని అతడు పేర్కొన్నాడు.
"ఏటా ఇలాంటి ప్రశ్న వస్తూనే ఉంటుంది. ధోనీ 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. నిలదొక్కుకొని ఆడేందుకు సమయం బాగానే దొరికింది. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించాడు. చాలాకాలంగా అతడు క్రికెట్ ఆడలేదు. అందుకే మహీలోని అత్యుత్తమ ఫినిషర్ బయటకొచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. మ్యాచ్ చివర్లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. డుప్లెసిస్ ఫామ్ కొనసాగించాడు. లక్ష్యానికి దాదాపుగా చేరుకున్నాం కాబట్టి బ్యాటింగ్ తీరుపై ఆందోళన లేదు."
-ఫ్లెమింగ్, సీఎస్కే కోచ్
మొదటి మ్యాచ్ తరహాలో షాట్లు బాది రన్‌రేట్‌ను తగ్గిస్తాడనే కరణ్‌ను ముందు పంపించామని ఫ్లెమింగ్ చెప్పాడు. రుత్‌రాజ్‌కు ఇదే తొలిమ్యాచని, దూకుడు కొనసాగించాలని పంపామన్నాడు. తమ బౌలర్లు లెంగ్త్‌ల విషయంలో పొరపాటు పడ్డారని పేర్కొన్నాడు. కాస్త ఫుల్ లెంగ్త్ బంతులు వేయడం వల్ల రాజస్థాన్ ఆటగాళ్లు భారీ షాట్లు ఆడారని తెలిపాడు.