ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడడానికి సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ పోరులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సీఎస్కే.. పాయింట్ల పట్టికలో ఎగబాకాలని మోర్గాన్ సేన పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
ఈసారి ఎలా ఆడుతుందో?
కోల్‌కతా నైట్ రైడర్స్.. లీగ్ ప్రారంభం నుంచి అస్థిర ప్రదర్శనతోనే నెట్టుకొస్తోంది. ఆడిన పన్నెండు మ్యాచుల్లో ఆరింటిలో గెలిచింది. సారథి మోర్గాన్, దినేక్ కార్తీక్‌లో నిలకడ లోపిస్తోంది. శుభ్‌మన్ గిల్, నరైన్, రానా, ఫెర్గుసన్ తమ ప్రదర్శనను ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ యూనిట్ బలంగా తయారైంది. ప్యాట్ కమిన్స్ గత కొన్ని మ్యాచుల నుంచి ప్రత్యర్థి బ్యాట్‌మెన్‌ను బాగానే కట్టడి చేస్తున్నాడు. అయితే గత మ్యాచ్‌లో పంజాబ్‌పై చివరిదాకా ప్రయత్నించినా కోల్‌కతా ఓడిపోయింది. కాబట్టి సీఎస్కేతో జరిగే మ్యాచ్‌లో జట్టులోని ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఆడితేనే గెలుస్తారు. ఇక ప్లేఆఫ్స్ విషయాని కొస్తే చెట్టు కొమ్మ చివరి అంచున పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి. చెన్నైతో ఆడోబోయే మ్యాచ్ సహా ఆ తర్వాత రాజస్థాన్‌తో ఆడే పోరులో గెలిస్తే.. నెట్‌రన్‌రేట్ ద్వారా అవకాశం లభించవచ్చు.
ఏమో చెప్పలేం!
పేలవ ప్రదర్శనతో లీగ్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్స్ అవకాశాల్ని చేజార్చుకుంది చెన్నై జట్టు. జట్టులో ఎవరూ నిలకడగా ఆడలేకపోతున్నారు. అయితే గత మ్యాచ్‌లో ఆర్సీబీపై రుతురాజ్ గైక్వాడ్ విజృంభించాడు. రాయుడు, డుప్లెసిస్ పర్వాలేదనిపించారు. ఇక ధోనీతో సహా మిగతా వారు తేలిపోయారు. బౌలింగ్‌లో సామ్ కరన్, చాహర్ వికెట్లు బాగానే పడగొట్టారు. ఇదే ఫామ్నూ కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కొనసాగించి జట్టు సమష్టిగా రాణిస్తే గెలిచే అవకాశం ఉంది. లేదంటే కథ మళ్లీ మాములే.
జట్ల అంచనాలు
కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్, మోర్గాన్(కెప్టెన్), నరైన్, కమిన్స్, ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
చెన్నై: సామ్ కరన్, డుప్లెసిస్, రాయుడు, జగదీషన్, ధోనీ (కెప్టెన్), రుతురాజ్, జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, హెజిల్వుడ్, తాహిర్
ఇదీ చూడండి ఉత్కంఠగా ఐపీఎల్ 'ప్లే ఆఫ్' రేస్