ETV Bharat / sports

ఐపీఎల్ 2020: దిల్లీ వేగాన్ని రాయల్స్​ తట్టుకోగలదా?

రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​​ జట్ల మధ్య షార్జా​ వేదికగా నేడు(శుక్రవారం) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

IPL PREVIEW
రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​​
author img

By

Published : Oct 9, 2020, 6:02 AM IST

Updated : Oct 9, 2020, 5:24 PM IST

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా దిల్లీ క్యాపిటల్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన దిల్లీ​.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఐదు మ్యాచ్​ల్లో మూడింటిలో ఓడి.. దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాయల్స్​​. ఇప్పుడీ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు బలహీనతలపై కథనం.

ఈసారైనా గెలవాలనే కసితో

రాజస్థాన్​ రాయల్స్​ షార్జా వేదికగా జరిగిన తమ తొలి రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి అభిమానులకు అసలైన ఐపీఎల్​ మజా పంచింది. కానీ అనంతరం ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయాల పరంపర కొనసాగించింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జాస్​ బట్లర్​ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. జయదేవ్​ ఉనద్కత్​, యువ ఆటగాడు రియాన్​ పరాగ్​ కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. కాగా, సారథి స్మిత్​, తెవాతియా, సంజూ శాంసన్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో మెరిసినా ఫలితం దక్కట్లేదు. తొలి రెండు మ్యాచుల్లో వీరి అండ వల్లే రాజస్థాన్​ విజయాన్ని దక్కించుకుంది. కాబట్టి దిల్లీతో జరిగే మ్యాచ్​లో కొన్ని మార్పులు చేసుకుని సమష్టిగా రాణిస్తేనే తప్ప గెలవడం కష్టమనే చెప్పాలి. మరో విశేషమేంటంటే ఈ మ్యాచ్​ షార్జాలో జరగనుంది. విజయం సాధించిన తొలి రెండు మ్యాచులను రాయల్స్​ ఇక్కడే ఆడింది. కాబట్టి ఈ వేదికపైన మరోసారి రాజస్థాన్​కు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

ఫుల్​ జోష్​.. తగ్గేదే లేదు

దిల్లీ క్యాపిటల్స్​ విజయాల పరంపరతో గెలుపు గుర్రంపై సవారీ చేస్తోంది. జట్టులోని స్టార్​ ఆటగాళ్లైన ఓపెనర్లు పృథ్వీ షా, రిషభ్​ పంత్​ అదరగొడుతున్నారు. మార్కస్​ స్టోయినిస్​ చెలరేగిపోతున్నాడు. సారథి శ్రేయస్​ వ్యూహాలను రచించి తమ ఆటగాళ్ల చేత పక్కాగా అమలు చేయిస్తున్నాడు. అతడూ బాగానే రాణిస్తున్నాడు. బౌలింగ్​ విభాగంలో కగిసొ రబాడా, ఎన్రిచ్‌ నోర్ట్జే ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​కు చెమటలు పట్టిస్తున్నారు. ఇదే ఫామ్​ను వీరు కొనసాగిస్తే రాయల్స్​ మరో ఓటమి మూటగట్టుకోవడం ఖాయం.

జట్ల అంచనా

దిల్లీ

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, అశ్విన్, కగిసొ రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్

రాజస్థాన్​

బట్లర్​(వికెట్​ కీపర్​), స్టీవ్​ స్మిత్​(కెప్టెన్​), సంజూ శాంసన్​, రాహుల్​ తెవాతియా, ఉతప్ప, రియాన్​ పరాగ్​, జోఫ్రా ఆర్చర్​, టామ్ కరన్​, శ్రేయస్​ గోపాల్​, అంకిత్​ రాజ్​పుత్​, ఉనద్కత్​

ఇదీ చూడండి జాదవ్​ను అందుకే ముందు పంపించాం: ఫ్లెమింగ్​

Last Updated : Oct 9, 2020, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.