ETV Bharat / sports

ఆర్సీబీxసన్​రైజర్స్​ : గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికే

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​.. అబుదాబి వేదికగా జరిగే ఎలిమినేటర్​లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్​ ప్రారంభమవుతుంది.

SRH VS RCB
ఆర్సీబీ సన్​రైజర్స్​
author img

By

Published : Nov 6, 2020, 5:31 AM IST

వరుస ఓటములతో సతమతవుతున్న బెంగళూరు, హ్యాట్రిక్​ విజయాలతో దూకుడు మీదున్న హైదరాబాద్.. శుక్రవారం జరిగే ఎలిమినేటర్​ మ్యాచులో​ తలపడనున్నాయి. ఇందులో గెలిచి ముందడగు వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు విజయం సాధిస్తారో?

మెండుగా గెలిచే అవకాశాలు

లీగ్​ తొలి అర్ధభాగంలో వరుస ఓటములను మూటగట్టుకున్నా సరే, చివర్లో గెలిచి ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది సన్​రైజర్స్​. కెప్టెన్ వార్నర్​, సాహా ఓపెనింగ్​ భాగస్వామ్యం అదరగొట్టడమే ఈ విజయాలకు కారణం. మనీశ్​ పాండే, విలియమ్సన్​, ప్రియమ్​ గార్గ్​, జేసన్​ హోల్డర్ జట్టుకు బాగా సహకరిస్తున్నారు. బౌలింగ్ విభాగానికి తిరుగే లేదు. పవర్​ప్లేలో సందీప్​ శర్మ, మిడిల్​ ఓవర్లలో హోల్డర్​, షబాజ్​ నదీమ్​, రషీద్​ ఖాన్.. డెత్​ ఓవర్లలో యార్కర్ల స్పెషలిస్ట్​ టి.నటరాజన్ తమ అదిరే ప్రదర్శనతో​ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్స్​కు చుక్కలు చూపిస్తున్నారు. మొత్తంగా జట్టు సమష్టి ప్రదర్శన చేస్తోంది. కాబట్టి ఇదే ఫామ్​ను కొనసాగిస్తే ఎలిమినేటర్​​లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.

మెరుగ్గా ప్రదర్శన చేస్తేనే.. లేదంటే అంతే!

బెంగళూరు జట్టు గత నాలుగు మ్యాచుల్లో ఓడి నిరాశ పరిచింది. అంతకు ముందు గెలిచి ఉండటం వల్ల ప్లేఆఫ్స్​కు చేరుకుంది. టాప్​ ఆర్డర్​ బ్యాటింగ్​ అంచనాలను అందుకోలేకపోతుంది. ఫించ్​ స్థానంలో వచ్చిన ఫిలిప్పి దూకుడుగా ఆడలేకపోతున్నాడు. దేవదత్​ పడిక్కల్​ నిలకడగా ఆడుతూ పర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లీ ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. డివిలియర్స్​ బాగానే ఆడుతున్నాడు. క్రిస్​ మోరిస్​, శివమ్ దూబె, సుందర్​ ఇంకా బాగా ఆడాలి. నవదీప్​ సైనీ ఈ మ్యాచ్​తో తిరిగి బరిలో దిగే అవకాశముంది. స్పిన్​ విభాగం బలంగానే ఉంది. మొత్తంగా జట్టులోని ఆటగాళ్లు కలిసికట్టుగా రాణిస్తేనే విజయం వరించి ముందుకు సాగుతారు. లేదంటే కథ మళ్లీ మాములే అవుతుంది.

జట్లు (అంచనా)

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), వృద్దిమాన్ సాహా (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.

బెంగళూరు: ఫిలిప్పీ, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, షహబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదానా, సిరాజ్, చాహల్

ఇదీ చూడండి : ప్లేఆఫ్స్​లో మరింత సరదాగా ఉంటుంది: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.