ETV Bharat / sports

పంజాబ్​పై వార్నర్​సేన ఘనవిజయం - సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ టుడే

IPL 2020: Sunrisers Hyderabad vs Kings XI Punjab live
ఐపీఎల్​ 2020
author img

By

Published : Oct 8, 2020, 6:36 PM IST

Updated : Oct 8, 2020, 11:32 PM IST

23:23 October 08

సన్​రైజర్స్​ మూడో విజయం

202 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు మరో 19 బంతులు మిగిలుండగానే 132 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. దీంతో పంజాబ్​పై 69 రన్స్​ తేడాతో వార్నర్​ సేన గెలవడం సహా టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. పంజాబ్​ జట్టు బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్​(77) అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. మరోవైపు సన్​రైజర్స్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ (4 ఓవర్లులో 12 పరుగులు సమర్పించి మూడు వికెట్లు సాధించాడు) ఉత్తమ ప్రదర్శన చేశాడు.

23:18 October 08

కాట్రెల్​ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ నటరాజన్​ వేసిన బంతికి పంజాబ్​ బ్యాట్స్​మన్​ కాట్రెల్​ డకౌట్​గా వెనుదిరిగాడు.

23:16 October 08

16 ఓవర్లకు పంజాబ్​ 131/8

16 ఓవర్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ ఎనిమిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రవి బిష్ణోయ్​ ​​(5), కాట్రెల్​(0) ఉన్నారు. పంజాబ్​ గెలుపు కోసం 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిఉంది.

23:12 October 08

షమి ఔట్​

సన్​రైజర్స్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ వేసిన బౌలింగ్​లో పంజాబ్​ బ్యాట్స్​మన్​ మహ్మద్​ షమి ఎల్బీడబ్లూతో డకౌట్​గా వెనుదిరిగాడు. 

23:10 October 08

పూరన్​ ఔట్​

అద్భుతమైన బ్యాటింగ్​తో ఆకట్టుకున్న పంజాబ్​ బ్యాట్స్​మన్​ నికోలస్ పూరన్​(77) రషీద్​ ఖాన్​ వేసిన బౌలింగ్​లో నటరాజన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

23:00 October 08

రెహమాన్​ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ ఖలీల్​ అహ్మద్​ వేసిన బంతికి పంజాబ్​ బ్యాట్స్​మన్​ రెహమాన్​(1) కీపర్​ బెయిర్​స్టో కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లకు పంజాబ్​ ఆరు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. నికోలస్​ పూరన్​ (77), రవి బిష్ణోయ్​ (0) క్రీజ్​లో ఉన్నారు. 

22:50 October 08

మన్​దీప్​ సింగ్​ ఔట్​

సన్​రైజర్స్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ వేసిన బంతికి పంజాబ్​ బ్యాట్స్​మన్​ మన్​దీప్​ సింగ్​(6) బౌల్డ్​ అయ్యాడు.

22:49 October 08

12 ఓవర్లకు పంజాబ్​ 112/4

12 ఓవర్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ నాలుగు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో నికోలస్​ పూరన్​ (66), మన్​దీప్ సింగ్ ​​(4) ఉన్నారు.

22:42 October 08

మ్యాక్స్​వెల్​ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ నటరాజన్​ వేసిన బంతికి పరుగు తీసే క్రమంలో పంజాబ్​ బ్యాట్స్​మన్​ మ్యాక్స్​వెల్​(7) వెనుదిరిగాడు. 

22:35 October 08

10 ఓవర్లకు పంజాబ్​ 96/3 

పది ఓవర్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ మూడు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో నికోలస్​ పూరన్​(58), మ్యాక్స్​వెల్​(5) ఉన్నారు.

22:29 October 08

పూరన్​ హాఫ్​సెంచరీ

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్​ 17 బంతుల్లో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతి తక్కువ బంతుల్లో హాఫ్​సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానానికి పూరన్​ చేరుకున్నాడు. అగ్రస్థానంలో కేఎల్​ రాహుల్​ (14 బంతుల్లో) ఉన్నాడు. 

22:24 October 08

8 ఓవర్లకు పంజాబ్​ 63/3 

8 ఓవర్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ మూడు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో పూరన్​(28), మ్యాక్స్​వెల్​(2) ఉన్నారు.

22:19 October 08

కేఎల్​ రాహుల్​ ఔట్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్​ అభిషేక్​ వర్మ వేసిన బంతికి పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(11) భారీ షాట్​కు ప్రయత్నించి విలియమ్సన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

22:15 October 08

6 ఓవర్లకు పంజాబ్​ 45/2 

ఆరు ఓవర్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో కేఎల్​ రాహుల్​(11), పూరన్​(13) ఉన్నారు.

22:05 October 08

ప్రభ్ సిమ్రన్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్. 11 పరుగులు చేసి ప్రభు సిమ్రన్ క్యాచ్ ఔటయ్యాడు.

21:54 October 08

మూడు ఓవర్లకు పంజాబ్ 20/1

మూడు ఓవర్లకు వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది పంజాబ్. రాహుల్ (10) సిమ్రన్ (1) క్రీిజులో ఉన్నారు.

21:50 October 08

మయాంక్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి రనౌటయ్యాడు.

21:45 October 08

తొలి ఓవర్లో పంజాబ్ 9/0

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​కు తొలి ఓవర్లో 9 పరుగులు లభించాయి. ఓపెనర్లుగా వచ్చిన రాహుల్ (1), మయాంక్ అగర్వాల్ (8) క్రీజులో ఉన్నారు.

21:30 October 08

పంజాబ్​ లక్ష్యం 202

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్ సన్​రైజర్స్​ హైదరాబాద్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. బెయిర్​ స్టో(97), డేవిడ్​ వార్నర్​ (50) అద్భుతమైన ప్రదర్శనతో జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో సహకరించారు. మరోవైపు పంజాబ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​ మూడు వికెట్లు సాధించి మ్యాచ్​ మలుపు తిరిగేలా చేశాడు.

21:26 October 08

అభిషేక్​ వర్మ ఔట్​

పంజాబ్​ పేసర్​ షమి వేసిన బౌలింగ్​లో సన్​రైజర్స్​ బ్యాట్స్​మన్ అభిషేక్​ వర్మ(12)​ భారీ షాట్​కు ప్రయత్నించి మాక్స్​వెల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

21:15 October 08

ప్రియమ్​ గార్గ్​ ఔట్​

అర్ష్​దీప్​ వేసిన బంతిని భారీ షాట్​గా మలచబోయిన సన్​రైజర్స్​ బౌలర్​ ప్రియమ్​ గార్గ్​ డకౌట్​గా వెనుదిరిగాడు.

21:11 October 08

సమద్ ఔట్​

రవి బిష్ణోయ్​ వేసిన బంతిని భారీ షాట్​ కొట్టబోయిన సన్​రైజర్స్​ బ్యాట్స్​మన్​ సమద్​(8) అర్ష్​దీప్​ సింగ్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లకు వార్నర్​సేన నాలుగు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 

21:04 October 08

మనీశ్​ పాండే ఔట్​

పంజాబ్​ బౌలర్​ అర్ష్​దీప్ సింగ్ వేసిన షార్ట్​పిచ్​ బాల్​ను ఎదుర్కోబోయిన మనీశ్​ పాండే(1) బౌలర్​కే క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

20:58 October 08

బెయిర్​ స్టో ఔట్​

సెంచరీకి చేరువైన సన్​రైజర్స్​ బ్యాట్స్​మన్​ బెయిర్​ స్టో(97) అర్ధాంతరంగా వెనుదిరిగాడు. పంజాబ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​ వేసిన బంతికి బెయిర్​ స్టో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్​ చేరాడు. 16 ఓవర్లకు హైదరాబాద్​ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

20:54 October 08

వార్నర్​ ఔట్​

పంజాబ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​ వేసిన బంతిని భారీ షాట్​గా మలచబోయిన డేవిడ్ వార్నర్​(52) మ్యాక్స్​వెల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:42 October 08

డేవిడ్​ వార్నర్​ హాఫ్​సెంచరీ

సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలతో అలరిస్తున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఎస్​ఆర్​హెచ్​ జట్టు వికెట్​ కోల్పోకుండా 154 పరుగులు చేసింది. డేవిడ్​ వార్నర్​(50), బెయిర్​ స్టో(94) క్రీజ్​లో ఉన్నారు. 

20:33 October 08

12 ఓవర్లకు హైదరాబాద్​ 130/0

12 ఓవర్లకు సన్​రైజర్స్​​ వికెట్​ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. డేవిడ్​ వార్నర్​(46), బెయర్​ స్టో(74) క్రీజ్​లో ఉన్నారు.

20:19 October 08

బెయిర్​ స్టో హాఫ్​సెంచరీ

సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓపెనర్​ బెయిర్​ స్టో అద్భుతమైన బ్యాటింగ్ శైలితో అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. పది ఓవర్లకు వార్నర్​సేన వికెట్​ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో డేవిడ్​ వార్నర్​(40), బెయిర్​ స్టో(53) ఉన్నారు.

20:09 October 08

8 ఓవర్లకు హైదరాబాద్​ 82/0

సన్​రైజర్స్​ ఓపెనర్లు బ్యాటింగ్​లో మొదటి ఓవర్​ నుంచి అదే దూకుడు కొనసాగిస్తున్నారు. 8 ఓవర్లకు హైదరాబాద్​ జట్టు వికెట్​ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. డేవిడ్​ వార్నర్​(30), బెయర్​ స్టో(46) క్రీజ్​లో ఉన్నారు.

19:57 October 08

6 ఓవర్లకు హైదరాబాద్​ 58/0

ఆరు ఓవర్లకు హైదరాబాద్​ వికెట్​ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. డేవిడ్​ వార్నర్​(26), బెయర్​ స్టో(26) క్రీజ్​లో ఉన్నారు.

19:47 October 08

4 ఓవర్లకు హైదరాబాద్​ 41/0

సన్​రైజర్స్​ ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్​ చేస్తున్నారు. నాలుగు ఓవర్లకు హైదరాబాద్​ వికెట్​ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. డేవిడ్​ వార్నర్​(16), బెయర్​ స్టో(19) క్రీజ్​లో ఉన్నారు.

19:38 October 08

2 ఓవర్లకు సన్​రైజర్స్​ 19/0

తొలి ఓవర్​లోనే 13 పరుగులు రాబట్టి సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓపెనర్లు జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి వార్నర్​సేన వికెట్​ నష్టపోకుండా 19 పరుగులు రాబట్టింది. ప్రస్తుతం క్రీజ్​లో డేవిడ్​ వార్నర్​(9), బెయిర్​ స్టో(5) ఉన్నారు.

19:01 October 08

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సన్​రైజర్స్​

టాస్​ గెలిచిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

జట్లు:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కెఎల్ రాహుల్ (కెప్టెన్​), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), జానీ బెయిర్‌స్టో (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్​, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కె ఖలీల్ అహ్మద్, టి నటరాజన్.

17:47 October 08

గెలుపు కోసం తహతహలాడుతున్న పంజాబ్​

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ - కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్లు మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లు ఆడిన వార్నర్​సేన రెండే విజయాలను నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్​ జట్టు ఆడిన ఐదు మ్యాచ్​ల్లో నాలుగింటిని ఓడి కేవలం ఒకే మ్యాచ్​లో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ అట్టడుగు స్థానానికి చేరుకుంది. టోర్నీలో మూడో విజయాన్ని దక్కించుకుని పాయింట్ల పట్టికలో ఎగబాకాలని సన్​రైజర్స్​ యోచిస్తుండగా.. రెండో గెలుపు అందుకోవాలని రాహుల్​సేన తహతహలాడుతుంది.  

Last Updated : Oct 8, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.