ETV Bharat / sports

సన్​రైజర్స్​పై చెన్నై సూపర్​ కింగ్స్​ విజయం - సీఎస్కే స్క్వాడ్ టుడే

IPL 2020: SRH vs CSK match live updates
చెన్నై వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​
author img

By

Published : Oct 13, 2020, 7:09 PM IST

Updated : Oct 13, 2020, 11:35 PM IST

23:13 October 13

చెన్నై గెలిచింది..

దుబాయ్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ 20​ పరుగుల తేడాతో విజయం సాధించింది. 168పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వార్నర్​ సేనను 147పరుగులకు కట్టడి చేయగలిగింది చెన్నై. చివర్లో కేన్​ విలియమ్సన్(57), రషీద్​ ఖాన్​(14)​​ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చెన్నై బౌలర్లలో కరణ్​ శర్మ, బ్రావో తలో 2 వికెట్లు పడగొట్టారు.

తడబడిన వార్నర్​ సేన...

లక్ష్యఛేదనలో సన్​రైజర్స్​ తడబడింది. కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ 9పరుగలకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్​ పాండే(4) కూడా ఎక్కువ సేపు  క్రీజులో నిలబడలేకపోయాడు. కేన్​ విలియమ్సన్​తో కలిసి బెయిర్​ స్టో(23).. సన్​రైజర్స్​ను గాడినపెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ కీలక సమయంలో ఔట్​ అయ్యాడు. చివర్లో విలియమ్సన్​ జట్టు గెలిపించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.  

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాంటింగ్​ ఎంచుకున్న సీఎస్​కే నిర్ణీత 20ఓవర్లలో 167పరుగులు చేసింది. వాట్సన్(42)​, రాయుడు(41) కీలక సమయంలో పరుగులు రాబట్టగా.. చివర్లో ధోనీ(21), జడేజా(25*)ల మెరుపులతో జట్టు స్కోరు 167కు చేరగలిగింది.

22:43 October 13

24 బంతుల్లో..

16 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి సన్​రైజర్స్​ 109 పరుగులు చేసింది. మరో 24 బంతుల్లో 59పరుగులు చేయాల్సి ఉంది. విలియమ్సన్​ 47పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

22:21 October 13

కష్టాల్లో వార్నర్​ సేన...

10ఓవర్లు ముగిసే సమయానికి సన్​రైజర్స్​​... మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. 60 బంతుల్లో 108 పరుగులు చేయాల్సి ఉంది.

21:40 October 13

2 ఓవర్లకు హైదరాబాద్​ 10/0

168 లక్ష్యఛేదనతో బరిలో దిగిన వార్నర్​సేన.. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి వికెట్​ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో బెయిర్​ స్టో (6), వార్నర్​ (3) ఉన్నారు. 

21:21 October 13

సన్​రైజర్స్​ లక్ష్యం 168

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు ఆరంభం నుంచే నెమ్మదిగా బ్యాటింగ్​ చేస్తూ వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాట్స్​మన్​ సామ్​ కరన్​ (31), అంబటి రాయుడు (41), షేన్​ వాట్సన్​ (42) అలరించారు. మరోవైపు సన్​రైజర్స్​ బౌలర్లు సందీప్​ శర్మ, ఖలీల్​ అహ్మద్​, నటరాజన్​ అద్భుతమైన బౌలింగ్​తో చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

21:12 October 13

బ్రావో ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ ఖలీల్​ అహ్మద్​ వేసిన బంతికి చెన్నై బ్యాట్స్​మన్​ డ్వేన్​ బ్రావో డకౌట్​గా వెనుదిరిగాడు.  

21:08 October 13

ధోనీ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ నటరాజన్​ వేసిన బంతికి సీఎస్కే కెప్టెన్​ ధోనీ (21) విలియమ్సన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

21:00 October 13

18 ఓవర్లకు చెన్నై 102/2

18 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై 138 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ధోనీ (14), జడేజా​ (7)ఉన్నారు. 

20:51 October 13

వాట్సన్​ ఔట్​

యార్కర్ స్పెషలిస్టు నటరాజన్​ వేసిన బౌలింగ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ షేన్​ వాట్సన్​ (42) మనీశ్​ పాండేకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:45 October 13

రాయుడు ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ ఖలీల్​ అహ్మద్​ వేసిన బంతిని బౌండరీగా మలచబోయిన సీఎస్కే బ్యాట్స్​మన్​ అంబటి రాయుడు(41).. డేవిడ్​ వార్నర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 16 ఓవర్లకు చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో షేన్​ వాట్సన్​ (42), ధోనీ (2) ఉన్నారు.

20:39 October 13

14 ఓవర్లకు చెన్నై 102/2

చెన్నై సూపర్​కింగ్స్ జట్టు బ్యాటింగ్​లో నిలకడగా రాణిస్తుంది. 14 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు(34), షేన్​ వాట్సన్​ (34)ఉన్నారు. 

20:21 October 13

10 ఓవర్లకు చెన్నై 69/2

పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్​కింగ్స్​ 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు (16), షేన్​ వాట్సన్​ (20)ఉన్నారు. 

20:09 October 13

8 ఓవర్లకు చెన్నై 61/2

8 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్​కింగ్స్​ 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు (12), షేన్​ వాట్సన్​ (16)ఉన్నారు. 

20:05 October 13

6 ఓవర్లకు చెన్నై 44/2

ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్​కింగ్స్​ టీమ్​ ఆరు ఓవర్లకు 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు(8), షేన్​ వాట్సన్​ (3) ఉన్నారు. 

19:59 October 13

సామ్​ కరన్​ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్​ సందీప్​ శర్మ మరోవికెట్​ పడగొట్టాడు. సీఎస్కే బ్యాట్స్​మన్​ సామ్​ కరన్​ (31) బౌల్డ్​గా వెనుదిరిగాడు

19:53 October 13

4 ఓవర్లకు చెన్నై 34/1

నాలుగు ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ వికెట్​ నష్టపోయి 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సామ్ కరన్​ (31), షేన్​ వాట్స్​న్​ (1) ఉన్నారు. 

19:44 October 13

డుప్లెసిస్​ ఔట్​

సన్​రైజర్స్​ బౌలర్ సందీప్​ శర్మ వేసిన బంతికి సీఎస్కే బ్యాట్స్​మన్​ ఫాఫ్​ డుప్లెసిస్​ డకౌట్​గా వెనుదిరిగాడు.

19:33 October 13

2 ఓవర్లకు చెన్నై 9/0

చెన్నై సూపర్​కింగ్స్ ఓపెనర్లుగా సామ్​ కరన్​, ఫాఫ్​ డు ప్లెసిస్​ బరిలో దిగారు. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి సీఎస్కే వికెట్​ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సామ్​ కరన్​ (9), డుప్లెసిస్​ (0) ఉన్నారు.

18:54 October 13

టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే

టాస్​ గెలిచిన చెన్నై సూపర్​కింగ్స్ కెెప్టెన్​ మహేంద్రసింగ్ ధోనీ​ బ్యాటింగ్​​ ఎంచుకున్నాడు. 

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్.

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, యంఎస్ ధోనీ (వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, సామ్ కరన్​, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, కర్ణ్​ శర్మ.

18:29 October 13

చెన్నై vs హైదరాబాద్​: ఆధిపత్యం ఎవరిది?

మంగళవారం దుబాయ్​ వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​, చెన్నై సూపర్​కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. సీఎస్కే టోర్నీలో ఇప్పటివరకు సరైన ప్రదర్శన చేయలేకపోయింది. ఆడిన ఏడు మ్యాచ్​ల్లో కేవలం రెండింటిలోనే గెలుపొందిన ధోనీసేన పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు ఏడు మ్యాచ్​ల్లో మూడింటిని గెలుపొంది.. ఐదో స్థానంలో నిలిచింది.

Last Updated : Oct 13, 2020, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.