ETV Bharat / sports

'ఆ రెండు క్యాచ్​లు వదిలేయకుండా ఉండాల్సింది' - బెంగళూర్ పంజాబ్ మ్యాచ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిసి జట్టుకు విజయాన్నందించాడు. అయితే ఇతడు ఇచ్చిన రెండు తేలిక క్యాచ్​లను వదిలేశాడు బెంగళూరు సారథి కోహ్లీ. ఓటమిపై స్పందిస్తూ ఈరోజు తమకు కలిసి రాలేదంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.

IPL 2020
'ఆ రెండు క్యాచ్​లు వదిలేయకుండా ఉండాల్సింది'
author img

By

Published : Sep 25, 2020, 8:50 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం చెందింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన బెంగళూరు ఘోర ఓటమి మూటగట్టుకుంది. సారథి కోహ్లీ రెండు క్యాచ్​లు జారవిడియడం వల్ల బతికిపోయిన కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఈ ఓటమిపై స్పందించిన కోహ్లీ తర్వాత మ్యాచ్​లో తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపాడు.

IPL 2020
పంజాబ్-బెంగళూరు

"ప్రారంభంలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పంజాబ్​ బ్యాట్స్​మన్​ను కట్టడి చేశారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈరోజు మాకు కలిసిరాలేదు. రాహుల్​ క్యాచ్​లను రెండుసార్లు జారవిడిచాం. అది మరో 35-40 పరుగులకు కారణమైంది. లేదంటే 180 పరుగుల లోపే కట్టడి చేసేవాళ్లం. ఛేజింగ్​లో ఒత్తిడికి గురయ్యాం. ఫిలిప్​.. బిగ్​బాష్ లీగ్​లో టాపార్డర్​లో వచ్చి మంచి ప్రదర్శన చేశాడు. అందుకే అతడిని మూడో స్థానంలో పంపించాం. మిడిల్ ఓవర్​లలో ఇంకా మెరుగ్గా ఆడాలి."

-కోహ్లీ, ఆర్​సీబీ సారథి

ఈ మ్యాచ్​లో కోహ్లీసేనపై ​కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్​సీబీ 109కే ఆలౌట్​ అయ్యింది. బౌలర్లలో రవి బిష్ణోయ్​(3), మురుగన్ అశ్విన్​(3) రాణించారు. పంజాబ్​ జట్టు విజయంలో సారథి కేఎల్​ రాహుల్​(132) కీలక పాత్ర పోషించాడు. శతకంతో మెరిసి.. ఇన్నింగ్స్​ను వన్​ మ్యాన్​ షోగా నడిపించాడు.

IPL 2020
పంజాబ్-బెంగళూరు మ్యాచ్

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.