ETV Bharat / sports

పంజాబ్​Xరాజస్థాన్​: సునామీ సృష్టించేదెవరు? - ఐపీఎల్​ మ్యాచ్​ 9

పంజాబ్​, రాజస్థాన్​​ జట్ల మధ్య ఆదివారం ఐపీఎల్ మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

IPL 2020
పంజాబ్​Xరాజస్థాన్
author img

By

Published : Sep 27, 2020, 5:30 AM IST

షార్జా వేదికగా చెన్నై‌పై అద్భుత విజయంతో రాజస్థాన్​ బోణీ కొట్టింది. మరోవైపు దిల్లీ చేతిలో ఓడి, బెంగళూరుపై గెలిచి ఊపుమీదుంది పంజాబ్​. ఇప్పుడీ జట్లు ఆదివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. రెట్టింపు జోరుతో బరిలో దిగుతున్నాయి. కచ్చితమైన వ్యూహాలతో పాయింట్లు పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

రాజస్థాన్​ రాయల్స్

చెన్నైతో మ్యాచ్​లో రాజస్థాన్​ గెలవడంలో సంజూ శాంసన్​(74), కెప్టెన్​ స్టీవ్​ స్మిత్(69)​ కీలకపాత్ర పోషించారు. చివర్లో వచ్చిన ఆర్చర్​.. బంతుల్ని బాది బౌలర్​కు చుక్కలు చూపించాడు. వీరితో పాటు ఓపెనర్లు జైస్వాల్​, ఉతప్ప లాంటి స్టార్​ బ్యాట్స్​మన్​ ఉండనే ఉన్నారు. రాహుల్​ తెవాటియా, ఆర్చర్​ లాంటి బౌలర్లు ఈ జట్టుకు బలం. ఇదే జోరుతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్​.. పంజాబ్​పై గెలుస్తుందో లేదో?

RR vs KXIP
రాజస్థాన్

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​

దిల్లీపై ఓడి, బెంగళూరుపై విజయఢంకా మోగించింది పంజాబ్​. ఆర్సీబీతో మ్యాచ్​లో కెప్టెన్​ రాహుల్​(132) పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆసీస్​ ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్​(5) మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్​లో మురగన్​ అశ్విన్​, రవి బిష్ణోయ్​, షెల్డన్​ కాట్రెల్​తో విభాగం బలంగా ఉంది. ఇప్పుడు రాజస్థాన్​తో మ్యాచ్​లో రాహుల్​ వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందో?

RR vs KXIP
పంజాబ్

జట్ల అంచనా

రాజస్థాన్​​

యశస్వి జైస్వాల్​, రాబిన్​ ఊతప్ప, సంజూ శాంసన్​, స్టీవ్​ స్మిత్​ (కెప్టెన్​), డేవిడ్​ మిల్లర్​, రియాన్​ పరాగ్​, శ్రేయస్​ గోపాల్​, టామ్​ కరన్​, రాహుల్​ తెవాటియా, జోఫ్రా ఆర్చర్​, జయ్​దేవ్​ ఉనద్కత్​.

పంజాబ్:

కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్​వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషమ్, మహమ్మద్ షమి, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.