ETV Bharat / sports

దిల్లీతో మ్యాచ్​లో ముంబయి జట్టు రికార్డులు - IPL

డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబయి మరోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో క్వాలిఫయర్​లో దిల్లీపై గెలిచి పలు ఘనతల్ని సాధించింది.

IPL 2020: RECORDS IN MUMBAI VS DELHI MATCH
దిల్లీతో క్వాలిఫయర్​లో ముంబయి జట్టు రికార్డులు
author img

By

Published : Nov 6, 2020, 10:25 AM IST

దుబాయ్‌లో గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయర్​లో ముంబయి ఇండియన్స్ పలు రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, దిల్లీ 143/8కే పరిమితమైంది. దీంతో మొత్తం మీద ఆరోసారి ఫైనల్లో ముంబయి అడుగుపెట్టింది.

మ్యాచ్​లో నమోదైన రికార్డులు

  • 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ.. పరుగుల ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ వేసిన బౌల్ట్‌.. పృథ్వీషా(0), అజింక్య రహానె(0)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో తొలి ఓవర్‌ను డబుల్‌ వికెట్‌ మెయిడిన్‌గా నమోదు చేసి రికార్డు సృష్టించాడు. మరోవైపు రెండో ఓవర్‌ వేసిన బుమ్రా.. ధావన్‌(0)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ లీగ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
    bumrah
    ముంబయి పేసర్ బుమ్రా
  • పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముంబయి పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్ నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టిన అతడు పవర్‌ప్లేల్లో 14 తీశాడు.
  • ఈ లీగ్‌ చరిత్రలో ముంబయి ఇప్పటివరకు పదిసార్లు మొదట బ్యాటింగ్ చేసి 200కిపైగా పరుగులు సాధించింది. ప్రతిసారి ఆ జట్టు విజయం సాధించడం విశేషం.
    rohit sharma
    ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ
  • ఈ సీజన్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ ఇప్పటివరకు అత్యధికంగా 29 సిక్సర్లు బాదాడు. అతడి తర్వాత సంజూ శాంసన్‌ (26), హార్దిక్‌ పాండ్య (25) ఉన్నారు. మరోవైపు అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలోనూ ముంబయి జట్టే ముందంజలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.