షార్జా వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్‌కు సంజూ శాంసన్(85), చివర్లో రాహుల్ తెవాతియా ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తెవాతియా ఏకంగా ఓకే ఓవర్లో ఐదు సిక్సలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డును సృష్టించింది పంజాబ్. దీనితో పాటే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
ఐపీఎల్ చరిత్రలో 98 సార్లు 200కు పైగా స్కోరు నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు సాధించిన స్కోరు 97వ సారి.. రెండో ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ సాధించిన స్కోరు 98వ సారి. ఈ టోర్నీ చరిత్రలో మొత్తం పంజాబ్ 200కు పైగా స్కోరును 14 సార్లు చేయగా.. రాజస్థాన్ తొమ్మిదిసార్లు నమోదు చేసింది. ఇరుజట్లు తలపడిన సందర్భాల్లో పంజాబ్ 11 సార్లు.. రాజస్థాన్ 17 సార్లు చేసింది. ఇరుజట్లు 24 సార్లు 200కు పైగా స్కోరును చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో దిగినప్పుడు మాత్రం 200కు పైగా స్కోరును 26 సార్లు అందుకుంది రాజస్థాన్.
ఐపీఎల్లో అతిపెద్ద లక్ష్యచేధన
223 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండంగానే చేధించింది రాజస్థాన్. లీగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద లక్ష్య చేధన. అంతకముందు రికార్డు కూడా రాజస్థాన్ పేరిటే ఉంది. దక్కన్ ఛార్జర్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ప్రారంభ సీజన్లో ముడు వికెట్లు కోల్పోయి సునాయసంగా పూర్తి చేసింది.
68వ సెంచరీ భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇది 68వ సెంచరీ భాగస్వామ్యం. 150కు పైగా పరుగుల చేసిన భాగస్వామ్యంలో ఇది 26వ సారి. మొత్తంగా ఇందులో పంజాబ్ జట్టు బ్యాట్స్‌మెన్ సెంచరీ భాగస్వామ్యాన్ని 26సార్లు చేయడం విశేషం.
60వ సెంచరీ
ఈ మ్యచ్‌లో మయాంక్ 106 పరుగులు చేశాడు. 45 నిమిషాల్లోనే ఈ సెంచరీ బాదటం విశేషం. టోర్నీ చరిత్రలో ఇది 60వ శతకం. ఇందులో పంజాబ్ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ 12 సార్లు శతకాలు నమోదు చేశారు. ఈ జట్టులో ఇప్పటివరకు 50 బంతుల్లోనే మూడు వేగవంతమైన సెంచరీలు చేశారు.
53వ అర్థసెంచరీ వీరిదే
టోర్నీ చరిత్రలో ఓపెనర్లు 53 సార్లు అర్థసెంచరీలు బాదారు. అందులో కేఎల్ రాహుల్(69), మయాంక్ అగర్వాల్(106) చేసిన అర్థశతకాలు 53వి.
తెవితియా మెరుపులు..
స్మిత్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాతియా పరుగులు రాబట్టడానికి చాలా కష్టపడ్డాడు. మొదటి 19 బంతుల్లో కేవలం 8పరుగులే చేశాడు. ఒకానొక సందర్భంలో అతడి వల్లే రాజస్థాన్ ఓడిపోతుందేమోనని అనుకున్నారంతా. కానీ 18వ ఓవర్లో తెవాతియా ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. కాట్రెల్ వేసిన ఆ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్ల బాదాడు. తమ జట్టును మళ్లీ రేసులో నిలబెట్టాడు. చివరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచి తన సత్తాను చాటిచెప్పాడు. ఆ ఒక్క ఓవర్‌తో పరిస్థితులు మారిపోయాయి. కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో రాయల్స్‌కు ఆ ఓవరే కీలకంగా మారింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్ ఇతడే.
ఇదీ చూడండి ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై రాయల్స్ విజయం