ETV Bharat / sports

ముంబయి భళా.. ఫైనల్​ చేరిన రోహిత్​సేన - ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్

IPL 2020 playoff race: MI vs DC match updates
MI vs DC match
author img

By

Published : Nov 5, 2020, 7:21 PM IST

Updated : Nov 5, 2020, 11:18 PM IST

23:08 November 05

ముంబయి భారీ విజయం

201 లక్ష్యఛేదనతో బరిలో దిగిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టును ఇన్నింగ్స్​ ఆరంభం నుంచే ముంబయి బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన దిల్లీ జట్టు 143 పరుగులు చేసింది. ఫలితంగా 57 రన్స్​ తేడాతో ముంబయి ఇండియన్స్ ఘన​ విజయం సాధించింది. బుమ్రా 4 వికెట్లు, బౌల్ట్​ 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. మరోవైపు దిల్లీ బ్యాట్స్​మెన్​ మార్కస్​ స్టోయినిస్​ (65), అక్షర్​ పటేల్​ (42) తప్ప మిగిలిన వారందరూ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. క్వాలిఫైయిర్​-1 మ్యాచ్​లో గెలుపుతో ముంబయి ఇండియన్స్​ సరాసరి ఫైనల్​లో అడుగుపెట్టింది. శుక్రవారం ఎలిమినేటర్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆడనున్నాయి. ఇందులోని​ విజేతతో దిల్లీ క్యాపిటల్స్​ తుదిపోరులో అవకాశం కోసం తలపడనుంది.   

22:52 November 05

 ఓటమి అంచుల్లో దిల్లీ

17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్​ 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అక్షర్​ పటేల్​ (32), కగిసో రబాడా (1) ఉన్నారు. దిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 86 రన్స్​ చేయాల్సిఉంది. 

22:27 November 05

స్టోయినిస్​ అర్ధశతకం

ఐదు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఆచితూచి బ్యాటింగ్​ చేస్తోంది. 12 ఓవర్లకు దిల్లీ 75 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్కస్​ స్టోయినిస్​ (51), అక్షర్​ పటేల్​ (7) ఉన్నారు. 

22:10 November 05

ముంబయి బౌలర్ల ధాటికి దిల్లీ బ్యాట్స్​మెన్​ బెంబేలు

దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మెన్​ను ముంబయి బౌలర్లు ధీటుగా కట్టడి చేస్తున్నారు. 8 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన దిల్లీ.. 42 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో మార్కస్​ స్టోయినిస్​ (24), అక్షర్​ పటేల్​ (1) ఉన్నారు. 

21:50 November 05

4 ఓవర్లకు 4 వికెట్లు...

ముంబయి ముందు దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మెన్​ చేతులెత్తేస్తున్నారు. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా, బౌల్ట్​ చెరో 2 వికెట్లు తీశారు. 4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది దిల్లీ జట్టు.  

21:40 November 05

ముంబయి ఇండియన్స్​ బౌలింగ్​ ముందు.. దిల్లీ బ్యాట్స్​మెన్​ తడబడుతున్నారు. తొలి ఓవర్లోనే పృథ్వీషా, రహానేను పెవిలియన్​ చేర్చాడు బౌల్ట్​. మరుసటి ఓవర్లో బుమ్రా.. ధావన్​ను బౌల్డ్​ చేశాడు. 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది దిల్లీ.

ప్రస్తుతం 2.4 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 

21:10 November 05

దిల్లీ క్యాపిటల్స్​ లక్ష్యం 201

టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్​ చేసిన రోహిత్​ సేనను మధ్యలో దిల్లీ బౌలర్ల ఇబ్బంది పెట్టినా మెరుపు ఇన్నింగ్స్​తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్​ (40), సూర్యకుమార్​ యాదవ్​ (51) రాణించగా.. చివర్లో బ్యాటింగ్​కు దిగిన ఇషాన్​ కిషన్​ (55), హార్దిక్​ పాండ్యా (37) ఇద్దరూ కలిసి వరుస బౌండరీలతో జట్టు స్కోరును 200కి చేర్చారు. 

20:51 November 05

జోరుగా బౌండరీలు

బ్యాటింగ్​లో ముంబయి ఇండియన్స్​ జోరు పెంచింది. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయిన రోహిత్​ సేన 140 పరుగులు రాబట్టింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్​ కిషన్​ (33), క్రునాల్​ పాండ్యా (13) ఉన్నారు. 

20:31 November 05

ధీటుగా బౌలింగ్​ చేస్తున్న దిల్లీ

ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్​ చేస్తున్న ముంబయి ఇండియన్స్​కు దిల్లీ బౌలర్లు ధీటుగా అడ్డుకుంటున్నారు. హాఫ్​ సెంచరీ తర్వాత సూర్యకుమార్​ యాదవ్​ పెవీలియన్​ చేరగా.. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన కిరన్​ పొలార్డ్​ డకౌట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయిన ముంబయి.. 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఇషాన్​ కిషన్​ (8), క్రునాల్​ పాండ్యా (1) ఉన్నారు. 

19:58 November 05

అదే దూకుడు

కెప్టెన్​ రోహిత్​ శర్మ వికెట్​ కోల్పోయినా.. ముంబయి ఇండియన్స్​ బ్యాటింగ్​లో మాత్రం జోరు తగ్గలేదు. 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఒక వికెట్​ నష్టపోయిన రోహిత్​ సేన.. 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో డికాక్​ (38), సూర్యకుమార్​ (22) ఉన్నారు. 

19:45 November 05

రోహిత్​ శర్మ డకౌట్​

దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ రవిచంద్రన్​ అశ్విన్​ బంతికి ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ డకౌట్​గా వెనుదిరిగాడు. 

19:37 November 05

ముంబయి శుభారంభం

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ తొలి ఓవర్​ నుంచే దూకుడుగా బ్యాటింగ్​ చేయడం ప్రారంభించింది. దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ డేనియల్​ సామ్స్​ వేసిన ఇన్నింగ్స్​ తొలి బంతిని ముంబయి ఓపెనర్​ డికాక్​ సిక్సర్​తో శుభారంభాన్నిచ్చాడు. దీంతో ఒక ఓవర్​లో రోహిత్​ సేన 15 పరుగులను రాబట్టింది.

19:17 November 05

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న దిల్లీ

టాస్​ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు. ముంబయి బ్యాటింగ్​ చేయనుంది. 

జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్​), క్వింటన్ డికాక్ (వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.

దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్​), రిషబ్ పంత్ (వికెట్​ కీపర్​), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే.

18:58 November 05

ఫైనల్​ బెర్తు ఎవరు ఖరారు చేసుకుంటారు?

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో కీలక ఘట్టం మొదలైంది. దుబాయ్​ వేదికగా తొలి క్వాలిఫయర్​ గురువారం జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచి ఫైనల్​లో అడుగుపెట్టాలని భావిస్తున్నాయి.  

Last Updated : Nov 5, 2020, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.