ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​పై పంజాబ్ ఘన​ విజయం - KKR vs RCB match prediction

KXIP vs DC match live updates
పంజాబ్​xదిల్లీ క్యాపిటల్స్​
author img

By

Published : Oct 20, 2020, 6:34 PM IST

Updated : Oct 20, 2020, 11:09 PM IST

22:54 October 20

దిల్లీ క్యాపిటల్స్​పై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165  పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ ఐదు వికెట్లు కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో నికోలస్​ పూరన్​(53), మ్యాక్స్​వెల్​(32) క్రీలక పాత్ర పోషించారు. మిగితా వారు నామమాత్రంగా రాణించారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది. పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది.  దిల్లీ బౌలర్లలో  రబాడా(2), అక్సర్ పటేల్​, అశ్విన్​ తలో వికెట్​ తీశారు.

22:46 October 20

పంజాబ్​ విజయం దిశగా పయనిస్తోంది. 16 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది పంజాబ్​. క్రీజులో దీపిక్​ హోడా(7), జేమ్స్​ నీషమ్​(0) ఉన్నారు. 

22:34 October 20

14ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్​ నాలుగు వికెట్ల కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో మ్యాక్స్​వెల్​(25), హోడా (3) ఉన్నారు. విజయానికి 36బంతుల్లో 28 పరుగులు అవసరం. 

22:11 October 20

పది ఓవర్లు ముగిశేసరికి పంజాబ్​ మూడు వికెట్లు నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో నికోలస్​ పూరన్​(25), మ్యాక్స్​వెల్​(19) ఉన్నారు. 20బంతుల్లో 16 పరుగులు చేయాలి. 

21:50 October 20

గేల్​(29) విధ్వంసానికి కళ్లెం వేశాడు అశ్విన్​. అతడిని క్లీన్​బౌల్డ్​ చేశాడు. దీంతో క్రీజులో మ్యాక్స్​వెల్​ వచ్చాడు. నికోలస్​ పూరన్​(4) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. మొత్తంగా 6ఓవర్లకు మూడు వికెట్లు నష్టానికి 57 పరుగులు చేసింది పంజాబ్​.   

21:47 October 20

ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్​ నష్టానికి 48 పరుగులు చేసింది పంజాబ్​. క్రీజులో క్రిస్​ గెల్​(26), మయాంక్​ అగర్వాల్​(5) ఉన్నారు. 

21:34 October 20

165 పరుగుల లక్ష్య ఛేదన ప్రారంభించిన పంజాబ్ తొలి వికెట్​ కోల్పోయింది. 15 చేసిన  కేఎల్​ రాహుల్..​ అక్షర్ పటేల్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

21:05 October 20

టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ధావన్​(106) మరోసారి సెంచరీతో మెరిశాడు. సారథి శ్రేయస్​(14), పంత్​(14) నామమాత్రంగా ఆడారు. మిగితా బ్యాట్స్​మెన్స్​ విఫలమయ్యారు. పంజాబ్​ బౌలర్లలో షమీ(2), మ్యాక్స్​వెల్​, అశ్విన్​, నీషమ్​ తలో వికెట్​ తీశారు.  

21:01 October 20

ఈ మ్యాచ్​లోనూ ధావన్​(102) సెంచరీ బాదాడు. దీంతో 19 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో ధావన్​తో పాటు షిమ్రాన్ హెట్మియర్(7) ఉన్నాడు. 

20:47 October 20

20:45 October 20

16ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది దిల్లీ. రవి బిష్టోయ్​ వేసిన ఓవర్లో 9పరుగులు వచ్చాయి. క్రీజులో ధావన్​(82) నిలకడగా రాణిస్తున్నాడు. స్టోయినిస్​(6) నిదానంగా ఆడుతోన్నాడు. 

20:38 October 20

14ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది దిల్లీ. క్రీజులో స్టోయినిస్​(2), ధావన్​(70) ఉన్నారు.  

20:22 October 20

పది ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ రెండు వికెట్లు నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్​ ధావన్​(57), పంత్​(9) ఉన్నారు. 

20:15 October 20

దిల్లీ రెండో వికెట్​ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్​లో సారథి శ్రేయస్​ అయ్యర్​(14) షాట్​కు యత్నించి రాహుల్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. క్రీజులోకి రిషభ్​ పంత్​(1) వచ్చాడు. ధావన్​(50) జాగ్రత్తగా ఆడుతోన్నాడు.  దీంతో తొమ్మిది ఓవర్లకు 74పరుగులు చేసింది. 

20:11 October 20

దిల్లీ క్యాపిటల్స్​ నిలకడగా ఆడుతోంది. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్​ నష్టానికి 68పరుగులు చేసింది. క్రీజులో ధావన్​(45), శ్రేయస్​(11) ఉన్నారు. 

19:55 October 20

ఐదో ఓవర్లో దిల్లీకి పన్నెండు పరుగులు వచ్చాయి.  క్రీజులో ధావన్​(33), శ్రేయస్​(7) ఉన్నారు. దీంతో ఐదు ఓవర్లకు వికెట్​ నష్టానికి 44పరుగులు చేసింది శ్రేయస్​ సేన.

19:45 October 20

దిల్లీ క్యాపిటల్స్​ తొలి వికెట్​ కోల్పోయింది. నీషమ్​ బౌలింగ్​లో పృథ్వీ షా(7) మ్యాక్​వెల్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 3.3ఓవర్లకు 25పరుగులు చేసింది శ్రేయస్​ సేన.

19:35 October 20

దిల్లీ క్యాపిటల్స్​ దూకుడుగా ఇన్నింగ్స్​ ప్రారంభించింది. ఓపెనర్లలో శిఖర్​ ధావన్(12) చెలరేగుతుండగా, పృథ్విషా(2) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్​ ఏమీ నష్టపోకుండా 16 పరుగులు చేసింది.  

19:08 October 20

జట్లు

దిల్లీ క్యాపిటల్స్​ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(సారథి), రిషభ్​ పంత్, షిమ్రాన్ హెట్మియర్, డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రాబాడా

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : కెఎల్ రాహుల్(సారథి), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్​వెల్​ దీపక్ హోడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్​ సింగ్

18:59 October 20

దిల్లీ క్యాపిటల్స్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. పంజాబ్​ బౌలింగ్​ దాడి చేయనుంది. 

18:21 October 20

దుబాయ్​ వేదికగా దిల్లీ క్యాపిటల్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ మధ్య ఈరోజు మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు  ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం దిల్లీ అగ్రస్థానంలో, పంజాబ్​ ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​ అవకాశాలను మెరుగు పరుచుకోవాలని పంజాబ్ ఆశిస్తోంది. మరోవైపు దిల్లీ కూడా ఈ మ్యాచ్​లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి?

Last Updated : Oct 20, 2020, 11:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.