ETV Bharat / sports

ముంబయిపై అందుకే ఓడిపోయాం: శ్రేయస్ అయ్యర్ - Fell short of reading the wicket, says Iyer

ముంబయిపై ఓటమి అనంతరం మాట్లాడిన దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. అందుకు గల కారణాల్ని వెల్లడించాడు.

IPL 2020: Fell short of reading the wicket, says Iyer
దిల్లీ ఓడిపోవటానికి కారణం తెలిపిన శ్రేయాస్​
author img

By

Published : Oct 31, 2020, 10:40 PM IST

పిచ్​ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ముంబయితో శనివారం జరిగిన మ్యాచ్​లో ఓడిపోయామని దిల్లీ కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​ చెప్పాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 110 పరుగులే చేయగలిగింది. దానిని ముంబయి 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది.

"పిచ్​ను అంచనా వేయటంలో విఫలమయ్యాం. మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనుకున్నాం, కానీ అది జరగలేదు. ఈ మ్యాచ్ ఓడిపోవటానికి మేం చేసిన పొరపాట్లే కారణం. ఓపెనర్లు బాగా ఆడాల్సింది. ఈ పిచ్​పై 150-160 పరుగులు చేస్తామనుకున్నాం కానీ సాధ్యపడలేదు. మామీద మాకు నమ్మకం ఉంది. బెంగళూరుతో జరగబోయే తర్వాత మ్యాచ్​ ఇరుజట్లకూ ఎంతో కీలకం"

--శ్రేయస్​ అయ్యర్​, దిల్లీ కెప్టెన్​

దిల్లీపై గెలిచిన తర్వాత ముంబయి.. తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. దిల్లీ - బెంగళూరు మ్యాచ్​ నవంబరు 2న జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.