ఈ ఏడాది ఐపీఎల్ గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. కరోనా నేపథ్యంలో విదేశంలో జరిగినా ఈ మెగా లీగ్ రసవత్తరంగా జరిగింది. అందుకే సోషల్ మీడియాలోనూ అభిమానులు బాగా ముచ్చట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ ప్లాట్‌ఫాంలో ఎక్కువగా వచ్చిన ట్వీట్స్ ఆధారంగా కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది ట్విట్టర్. వ్యక్తుల్లో కోహ్లీ, జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ గురించే ఎక్కువమంది మాట్లాడుకున్నట్లు తెలిపింది .
జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది ట్విట్టర్. ఈ జాబితాలో దిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేసి.. పూరన్‌పై ప్రశంసలు కురిపించారు. దీనికి రెండు లక్షలకు పైగా లైక్స్, 23వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఈ ట్వీట్‌ను 'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది ట్విట్టర్.
-
This is the best save I have seen in my life. Simply incredible!! 👍#IPL2020 #RRvKXIP pic.twitter.com/2r7cNZmUaw
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is the best save I have seen in my life. Simply incredible!! 👍#IPL2020 #RRvKXIP pic.twitter.com/2r7cNZmUaw
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020This is the best save I have seen in my life. Simply incredible!! 👍#IPL2020 #RRvKXIP pic.twitter.com/2r7cNZmUaw
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020
ముంబయి ఇండియన్స్ హవా
ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ సెక్షన్లో ముంబయి ఇండియన్స్ దుమ్మురేపింది. రోహిత్ సేన.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లే ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన పోరులు రెండో స్థానంలో నిలవగా.. దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన మ్యాచ్‌లు మూడో స్థానంలో నిలిచాయి.
దుబాయ్ వేదికగా నవంబరు 10న జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచిన రోహిత్ సేన.. ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది.
ఇదీ చూడండి : 'విరాట్ సెల్ఫీ మా కల నెరవేర్చింది'