ETV Bharat / sports

కేకేఆర్​పై ప్రాక్టీస్ ప్యాంట్​తో డికాక్ బ్యాటింగ్

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మన్​ క్వింటన్​ డికాక్​.. తన ప్రాక్టీస్ ప్యాంటుతో బ్యాటింగ్​ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే దీని వల్ల మార్కెటింగ్​ విభాగంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. ఇలాంటి పని మరోసారి చేయొద్దని డికాక్​కు కోచ్​ జయవర్ధనే సూచించాడు.

IPL 13: Quinton de Kock shines as Mumbai Indians defeat KKR by 8 wickets
ప్రాక్టీసు ప్యాంట్​పై బ్యాటింగ్​ చేసిన డికాక్​
author img

By

Published : Oct 17, 2020, 1:26 PM IST

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్​ గెలుపొందింది. ముంబయి బ్యాట్స్​మన్​ క్వింటన్​ డికాక్​ 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్​లో అద్భుత ఇన్నింగ్స్​తో అలరించిన డికాక్​.. తన ప్రాక్టీస్ ప్యాంట్​ వేసుకుని బ్యాటింగ్​ చేశాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతడే వెల్లడించాడు. అయితే దీనివల్ల మార్కెటింగ్​ టీమ్​తో ఇబ్బందులు తలెత్తే కారణంగా మరోసారి అలా చేయొద్దని కోచ్​ జయవర్ధనే.. డికాక్​కు సూచించాడు.

IPL 13: Quinton de Kock shines as Mumbai Indians defeat KKR by 8 wickets
రోహిత్ శర్మ, క్వింటన్​ డికాక్​

"డికాక్​ తన ప్రాక్టీస్ ప్యాంట్​తో బ్యాటింగ్ చేయడం తప్ప మ్యాచ్​లో మిగితావన్నీ సక్రమంగా జరిగాయి. దీనివల్ల మార్కెటింగ్​ విభాగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోసారి ఇలా చేయొద్దని అతడికి సూచించా."

- జయవర్ధనే, ముంబయి ఇండియన్స్​ కోచ్​

ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ మరోసారి ఆల్‌రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టింది. కోల్​కతా నైట్​రైడర్స్​ను చిత్తుగా ఓడించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విజయంలో డికాక్​(78), రోహిత్(35)​ కీలక పాత్ర పోషించారు. హార్దిక్​ పాండ్యా, సూర్యకుమార్​ యాదవ్​ పర్వాలేదనిపించారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ముంబయి బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. టోర్నీలో వరుసగా ఐదో విజయంతో 12 పాయింట్లను ముంబయి ఇండియన్స్​ తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానానికి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.