టీ20ల్లో 20వ ఓవర్ ఎంతో ముఖ్యమైంది. ప్రధానంగా బ్యాట్స్‌మెన్‌కు ఈ ఓవర్ అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఇందులో అతడు సాధించే స్కోరుపై జట్టు గెలుపు, ఓటమి ఆధారపడి ఉంటుంది. అనేకసార్లు ఈ ఓవర్‌తోనే అంచనాలు తలకిందులైన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్లో ఇప్పటివరకు జరిగిన తొలి ఎనిమిది మ్యాచుల్లో 20వ ఓవర్లో ఆటగాళ్ల గణాంకాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
20వ ఓవర్లోనే ఎక్కువ
మొత్తంగా 78బంతుల్లో(20వ ఓవర్లో) 14.54 సగటుతో 189 పరుగులు చేశారు బ్యాట్స్‌మెన్. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో ఈ ఓవర్లోనే అత్యధిక పరుగులు చేశారు. ఇక పద్దెనిమిదో ఓవర్లో 11.80 , 17వ ఓవర్లో 10.44, 19ఓవర్లో 9.14 సగటుతో మాత్రమే పరుగులు చేశారు.
చాలా తక్కువగా
తొలి రెండు ఓవర్లు, 11వ ఓవర్ విషయానికొస్తే చాలా తక్కువ పరుగులు తీశారు బ్యాట్స్‌మెన్. రెండో ఓవర్లో 5.25 సగటుతో 84పరుగులు మాత్రమే చేశారు. తొలి ఓవర్లో 5.31, 11 ఓవర్లో 6.31 సగటుతో రన్స్ సాధించారు.
16,20 ఓవర్లోనే ఎక్కువ
బౌలర్ల విషయానికొస్తే 16, 20ఓవర్లలో ఎక్కువ వికెట్లను పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఈ రెండు ఓవర్లలో 11వికెట్లు చొప్పున తీశారు బౌలర్లు. అయితే తొలి, ఎనిమిది, పదమూడు ఓవర్లలో మాత్రం తక్కువ వికెట్లు తీశారు. తొలి ఓవర్లో చాలా తక్కువగా 2 వికెట్లు తీయగా.. రెండో ఓవర్లో మాత్రం ఏకంగా ఆరు వికెట్లు తీసి అదరగొట్టారు.
ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్‌ను రైనా అన్‌ఫాలో చేశాడా?