ETV Bharat / sports

'బుకీలు ఇప్పటికే దుబాయ్​ చేరుకున్నారు..కానీ!'

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో బెట్టింగ్​ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇప్పటికే కొంతమంది బుకీలు యూఏఈ చేరుకున్నారని అంటున్నారు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి అజిత్​ సింగ్​. ఇప్పటివరకు వారు లీగ్​లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారని తెలిపారు. బయో బబుల్​పై మూడు ప్రత్యేక బృందాలు నిఘా ఉంచాయని వెల్లడించారు. ​

IPL 13: BCCI Anti-Corruption Unit reveals that bookies have arrived in Dubai
ఐపీఎల్​: బుకీలు ఇప్పటికే దుబాయ్​ చేరుకున్నారు..కానీ!
author img

By

Published : Oct 1, 2020, 8:43 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్(ఐపీఎల్​) కోసం క్రికెట్​ అభిమానులే కాకుండా ​బెట్టింగ్​ బుకీలూ ఆసక్తిగా ఎదురుచూస్తారని అంటున్నారు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి అజిత్​ సింగ్​. అందువల్ల ప్రస్తుత సీజన్​లో బుకీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. టోర్నీలో బెట్టింగ్​ కార్యకలాపాలు జరగకుండా యూఏఈ క్రికెట్​ బోర్డు, స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"కొంతమంది బుకీలు దుబాయ్​కి చేరుకున్నారు. కానీ, వారు ఇంకా లీగ్​పై ప్రభావం చూపించలేదు. బయో బబుల్​లోని ప్రతి కదలికను తెలుసుకోవడానికి మూడు వేదికల చుట్టూ మూడు వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి చర్యలను నిర్మూలించడానికి ప్రత్యేక నిఘా ఉంచాం. దీని కోసం ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డు (ఈసీబీ)తో పాటు స్థానిక పోలీసులు మాకు సహకారాన్ని అందిస్తున్నారు. భారత్​ వేదికగా గతంలో జరిగిన కొన్ని బెట్టింగ్​ కార్యకలాపాలను ట్రాక్​ చేసిన పోలీసుల నివేదికలను ఇందుకోసం పరిశీలిస్తున్నాం."

- అజిత్​ సింగ్​, బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి

ఐపీఎల్​లో బెట్టింగ్​ కార్యకలాపాలను చట్టపరమైన నేరంగా పరిగణిస్తూ దీని కోసం ఓ ప్రత్యేకమైన క్రిమినల్​ చట్టం తీసుకురావాలని అజిత్ సింగ్​ అన్నారు. అలాంటి చర్యలవల్లే బుకీలకు అడ్డుకట్ట వేయగలుగుతామని వెల్లడించారు.

"మ్యాచ్​ ఫిక్సింగ్​ను క్రిమినల్​ నేరంగా చేసే ఒక చట్టం మాకు అవసరం. అలాంటి వ్యతిరేక చర్యలు ఆపడానికి ఇది సహాయపడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ, దీనికోసం ప్రత్యేక చట్టం అవసరం" అని ఆయన సూచించారు అజిత్ సింగ్.

ఎవరూ తప్పించుకోలేరు

సోషల్​మీడియాలో ఐపీఎల్​కు సంబంధించిన ప్రతి చర్యనూ ఓ బృందం నిశితంగా పరిశీలిస్తోందని అజిత్​ సింగ్​ స్పష్టం చేశారు. ఆ బృందం కళ్లు కప్పి ఎవరూ తప్పించుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.