ETV Bharat / sports

నా బౌలింగ్ బలం అదే: రషీద్​ ఖాన్​ - Indian Premier League updates

దిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​ జట్టు అదరగొట్టింది. రషీద్​ ఖాన్​ తన బౌలింగ్​ మాయాజాలంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు​. తమ​ గెలుపుపై ఆనందాన్ని పంచుకున్నాడు సన్​రైజర్స్ హైదరాబాద్​​ జట్టు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​. మరో వైపు.. వరుసగా మూడు ఓటములు చవిచూసిన దిల్లీ జట్టు.. ఈ వైఫల్యాలతో కుంగిపోకుండా రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పింది.

I bowl with clear mind, that's my biggest strength says sunrisers hyderabad player rashid khan
అన్నీ పరిశీలించాకే రంగంలోకి దిగుతా:రషీద్​ ఖాన్​
author img

By

Published : Oct 28, 2020, 5:25 AM IST

దుబాయ్​ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సన్​రైజర్స్​ హైదరాబాద్. ఆ జట్టు​ విజయంలో రషీద్​ ఖాన్​ (4-0-7-3​)కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్లలో 17 డాట్​బాల్స్​తో బ్యాట్స్​మెన్​ను కట్టడి చేశాడు. పూర్తి అవగాహనతో బౌలింగ్​లోకి దిగడమే తన బలమని చెబుతున్నాడు ఈ అఫ్గాన్​ లెగ్​ స్పిన్నర్.

"నేను స్పష్టమైన నిర్ణయం తీసుకుని బౌలింగ్​కి దిగుతాను. అదే నా బలం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేను మంచి లైన్​, లెంగ్త్​లో బౌల్​ చేస్తాను. బ్యాట్స్​మెన్​ బలాబలాలను పరిశీలిస్తాను. వాటిని దృష్టిలో ఉంచుకుని నేను ఆట కొనసాగిస్తాను. మ్యాచ్ గెలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. డాట్​ బాల్స్​ సాయంతో వికెట్లు పడగొట్టగలిగాను."

-- రషీద్​ ఖాన్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాడు.

'ఆ పద్ధతిలో ఆడాం..'

సన్​రైజర్స్​ విజయంపై ఆ జట్టు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్ ఆనందం వ్యక్తం చేశాడు. 2009 నాటి పద్ధతిని ఈ సారి అవలంబించానని చెప్పాడు.

"గత మ్యాచ్​ ఓటమి మమ్మల్ని నిరాశకు గురి చేసింది. కానీ, ఈసారి నేను 2009 నాటి సంప్రదాయాన్ని పాటించాను. టాప్​ ఆర్డర్​ బాధ్యతను తీసుకున్నాను. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ క్రికెట్ ఆడటం కష్టమే. అందుకే నేను నా బ్యాట్​ను ఝుళింపించాను. "

-- డేవిడ్​ వార్నర్​, సన్​రైజర్స్​ హైదరాబాద్ కెప్టెన్​.

'స్పూర్తిగా తీసుకుంటాం..'

తాజా ఓటమితో తాము కుంగిపోబోమని తెలిపాడు దిల్లీ క్యాపిటల్స్​ జట్టు కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​. ఈ పరాభవం ఇచ్చిన స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పాడు.

" మాకు మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉన్నాయి. ఒక్క విజయం మాకు సరిపోతుంది. ఈ మూడు ఓటములతో మేము కుంగిపోము. వైఫల్యాల్ని స్ఫూర్తిమంతంగా తీసుకుని మిగితా మ్యాచుల్లో రాణిస్తాం"

-- శ్రేయస్​ అయ్యర్​, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్​.

హైదరాబాద్​ జట్టు నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ.. 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్​ఔట్​ అయ్యింది.

ఇదీ చూడండి:దుమ్మురేపిన ​హైదరాబాద్​... చిత్తైన దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.