ETV Bharat / sports

'కేఎల్​ రాహుల్​ నిలకడగా ఆడటానికి రహస్యం అదే' - gawaskar kl rahul

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సారథి కేఎల్​ రాహుల్​ నిలకడగా ఆడటం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు టీమ్​ఇండియా దిగ్గజం సునీల్​ గావస్కర్​. బెంగళూరు నేపథ్యం నుంచి రావడం వల్లే ఇది సాధ్యమైందని అన్నాడు.

rahul
కేఎల్​ రాహుల్​
author img

By

Published : Oct 20, 2020, 9:40 PM IST

Updated : Oct 20, 2020, 10:28 PM IST

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సారథి కేఎల్​ రాహుల్​ను ప్రశంసించాడు దిగ్గజ ఆటగాడు సునీల్​ గావస్కర్​. అతడు నిలకడగా ఆడటానికి వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు. బెంగళూరు నీళ్లు తాగి పెరగడం వల్లే బాగా ఆడుతన్నాడన్నాడు. గొప్ప గొప్ప క్రీడాకారులంతా బెంగళూరు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లేనని గుర్తుచేశాడు.

"బెంగళూరు నీళ్లు తాగి పెరిగిన శరీరం అతడిది. అక్కడి నుంచి వచ్చిన వాళ్లంతా ప్రపంచ స్థాయి ఆడగాళ్లుగా ఎదిగారు. క్రికెట్​లోనే కాదు అన్ని క్రీడల్లోనూ గొప్పగా రాణించారు. ప్రకాశ్​ పదుకొణె నాకు ఎంతో ఇష్టమైన ఆటగాడు. గుండప్పా విశ్వనాథ్​, ఎర్రపల్లి ప్రసన్న, అనిల్​ కుంబ్లే, రాహుల్​ ద్రావిడ్​ వీరంతా బెంగళూరు నుంచి వచ్చినవారే. ఇదంతా ఆ నగర నీరు తాగడం వల్లే సాధ్యమైంది."

-గావస్కర్​, టీమ్​ఇండియా దిగ్గజం

ప్రస్తుతం పంజాబ్​ జట్టు నేడు జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడుతోంది. ఈ సీజన్​లో ఇప్పటివరకు రాహుల్​(525) ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి ఇంగ్లాండ్​తో 'గులాబీ' ​టెస్ట్​కు అహ్మాదాబాద్​ ఆతిథ్యం

Last Updated : Oct 20, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.