రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా కోహ్లీ సేన విజయం సాధించింది. అయితే ఇందులో ముంబయి గెలుస్తుందని క్రీడాభిమానులంతా భావించారు. కెరీర్లో ఒక్కసారి కూడా సూపర్ ఓవర్లో ముంబయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా విఫలం కాకపోవడమే ఇందుకు కారణం. కానీ.. బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్, సారథి విరాట్ కోహ్లీ.. తొలిసారి యార్కర్ల కింగ్ బుమ్రాకు ఈ పద్ధతిలో పరాజయం రుచిచూపారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 7 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది బెంగళూరు.
కెరీర్లో ఐదుసార్లు
కెరీర్లో బుమ్రా ఇప్పటి వరకూ ఐదు సార్లు సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయగా.. బెంగళూరుపై మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ అతడు విజయవంతమయ్యాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా తరఫున బౌలింగ్ చేశాడు.
కాగా, ఐపీఎల్ 2017లో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో 12 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ లయన్స్‌ను బుమ్రా 6/0కే పరిమితం చేసి ముంబయిని గెలిపించాడు. ఆ తర్వాత 2019లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సూపర్ ఓవర్లో 8/2కి కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇదీ చూడండి ముంబయిపై బెంగళూరు 'సూపర్' విజయం