ETV Bharat / sports

'వచ్చే సీజన్​లోనూ ధోనీయే కెప్టెన్​' - ధోనీ

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​లోనూ చెన్నై సూపర్ ​కింగ్స్ సారథిగా ధోనీ కొనసాగుతాడని జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్​ పేర్కొన్నాడు. ధోనిపై వస్తోన్న విమర్శలపై విశ్వనాథన్​ ఈ విధంగా స్పందించాడు.

Dhoni_CSK
'వచ్చే సీజన్​లోనూ ధోనీయే కెప్టెన్​'
author img

By

Published : Oct 28, 2020, 9:13 AM IST

రానున్న 2021 ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై జట్టుకు ధోనీయే కెప్టెన్‌గా ఉంటాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ అన్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై ఘోరంగా విఫలమైంది. అన్ని జట్ల కంటే ముందుగానే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో పాటు జట్టును ముందుండి నడిపించడంలోనూ ధోనీ విఫలమయ్యాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు సీఈవో తమ కెప్టెన్‌పై విశ్వాసం వ్యక్తంచేస్తూ స్పందించారు.

" ఈసారి మేం శక్తి మేర క్రికెట్‌ ఆడలేకపోయాం. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓడిపోయాం. మేం ఈ స్థితిలో ఉండటానికి అదే కారణం. సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ లేని లోటు జట్టులో కనిపించింది. ఈసారి అభిమానులను ఆకట్టుకోలేకపోయాం. ఏదేమైనా మా కెప్టెన్‌ ధోనీపై మాకు నమ్మకం ఉంది. 2021లోనూ ధోనీ కెప్టెన్‌గా చెన్నైని ముందుండి నడిపిస్తాడు. అతను మూడుసార్లు చెన్నైని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. లీగ్‌ చరిత్రలో చెన్నైకి ఉన్న రికార్డు మరే జట్టుకూ లేదు. 2020 మాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఒక్క చెడ్డ ఏడాది ధోనీ సామర్థ్యాన్ని నిర్ణయించలేదు" అని విశ్వనాథన్‌ అన్నారు.

మరి.. ధోనీ ఇంకా చెన్నై జెర్సీతో మైదానంలో కొనసాగుతాడా? లేదా అన్నది స్వయంగా ధోనీ వెల్లడించే వరకూ వేచి చూడాల్సిందే మరి!

ఇదీ చదవండి:'భారత టీ20 జట్టుకు ఎంపికవడం నమ్మలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.