ముంబయిదే గెలుపు
పదమూడో సీజన్ లీగ్ విజేతగా ముంబయి నిలిచింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబయి అయిదో టైటిల్ సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (65*), పంత్ (56) రాణించారు. ఆ జట్టును బౌల్ట్ (3/30) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (68) అర్ధశతకంతో చెలరేగాడు.