సూపర్ ఓవర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చి కోల్‌కతా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు బౌలర్ లాఖీ ఫెర్గూసన్. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫెర్గూసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేశాడు.
" ఈ మ్యాచ్‌లో నా ఫేవరెట్ వికెట్.. సూపర్ ఓవర్ మొదటి బంతిలోనే డెవిడ్ వార్నర్‌ను ఔట్ చేయడం".
- ఫెర్గూసన్, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్.
మోర్గాన్ ఆధ్వర్యంలో ఆడడం ఆనందంగా ఉందని ఫెర్గూసన్ తెలిపాడు. ఈ మ్యాచ్ గెలవడం సంతోషాన్నించిందని వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మెన్ కష్టానికి ప్రతిఫలంగా బౌలింగ్‌లోనూ రాణించడం వల్లే ఈ గెలుపు సొంతమైందని అన్నాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్.. ముందు జరిగిన మ్యాచ్‌లో, సూపర్ ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఇదీ చదవండి:కోల్‌కతా సూపర్ విజయం.. సన్‌రైజర్స్‌కు తప్పని ఓటమి