చెన్నై సూపర్ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ ధావన్(101) సెంచరీతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లలో చాహర్(2) సామ్ కరణ్, శార్దూల్ ఠాకూర్, బ్రావో తలో వికెట్ తీశారు.
సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్ విజయం - ఐపీఎల్ లైవ్
23:11 October 17
23:08 October 17
సామ్‌కరన్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన ఆలెక్స్‌కేరీ(4) డుప్లెసిస్ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో దిల్లీ 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు విజయానికి 11 బంతుల్లో 21 పరుగులు చేయాలి. ధావన్ 98 పరుగులతో ఉన్నాడు.
22:56 October 17
దిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి చేరువవుతోంది. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో ధావన్, క్యారీ ఉన్నారు. విజయానికి 18 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది.
22:17 October 17
ఆత్మవిశ్వాసంతో దిల్లీ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో ఉన్న ధావన్, శ్రేయస్.. స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేశారు. విజయానికి 60 బంతుల్లో 104 పరుగులు కావాలి.
21:47 October 17
దిల్లీ క్యాపిటిల్స్ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో మరో 151 పరుగులు కావాల్సి ఉంది.
21:27 October 17
దిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
21:08 October 17
దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్ 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు 45 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వారిలో వాట్సన్ (36), జడేజా(33)నాటౌట్ పర్వాలేదనిపించారు. దిల్లీ బౌలర్లో నోర్జే(2).. తుషార్, రబాడా తలో వికెట్ తీశారు.
20:50 October 17
నాలుగో వికెట్ కోల్పోయింది చెన్నై జట్టు. నోర్జె బౌలింగ్‌లో ధోనీ(3) షాట్‌కు యత్నించి అలెక్స్ క్యారీ చేతికి చిక్కాడు. దీంతో పదిహేడు ఓవర్లకు 134స్కోరు చేసింది. క్రీజులోకి రవీంద్ర జడేజా (1) వచ్చాడు. అంబటి రాయుడు(34) జాగ్రత్తగా ఆడుతున్నాడు.
20:39 October 17
దూకుడుగా ఆడుతోన్న చెన్నై జట్టుకు కళ్లెం వేశాడు ధావన్. రబాడా బౌలింగ్‌లో డుప్లెసిస్(58) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పదిహేను ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది సీఎస్కే. క్రీజులో రాయుడు(15), ధోనీ(1) ఉన్నారు.
20:23 October 17
రెండో వికెట్ కోల్పోయింది చెన్నై జట్టు. నోర్జె బౌలింగ్‌లో వాట్సన్ (36) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రీజులో డుప్లెసిస్(50),అంబటి రాయుడు(1) ఉన్నారు. 11.4ఓవర్లకు స్కోరు 87గా ఉంది.
20:15 October 17
చెన్నై జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(36), వాట్సన్(34) ఉన్నారు.
19:50 October 17
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై జట్టు వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (19), వాట్సన్(9) ఉన్నారు.
19:45 October 17
చెన్నై జట్టు నెమ్మదిగా ఆడుతోంది. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 12పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో వాట్సన్(8), డుప్లెసిస్(3) ఉన్నారు.
19:33 October 17
పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్‌కింగ్స్. తుషార్ బౌలింగ్‌లో ఓపెనర్ సామ్ కరన్ ఔటయ్యాడు. క్రీజులో వాట్సన్, డుప్లెసిస్ ఉన్నారు.
19:00 October 17
టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో దిల్లీ బౌలింగ్ దాడిని ప్రారంభించనుంది.
జట్లు
చెన్నై:డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, ధోనీ(కెప్టెన్), జాదవ్, జడేజా, సామ్ కరన్, బ్రావో, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకుర్, కర్ణ్ శర్మ
దిల్లీ: పృథ్వీషా, శిఖర్ ధావన్, రహానె, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), స్టోయినిస్, క్యారీ, అక్షర్ పటేల్, అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, రబాడ, అన్రిచ్
18:40 October 17
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడతాడా?
షార్జా వేదికగా దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌ల్లో గెలిచిన ఇరుజట్లు.. ఇందులో గెలిచి ఫ్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాయి. గత మ్యాచ్‌లో గాయపడ్డ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఈరోజు ఉంటాడా? లేదా?