ETV Bharat / sports

'మలింగ వారసత్వాన్ని బుమ్రా కొనసాగిస్తున్నాడు'

ముంబయి ఇండియన్స్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రాపై ఆ జట్టు ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్​లో లసిత్​ మలింగ వారసత్వాన్ని బుమ్రా కొనసాగిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.

Bumrah has taken over the mantle from Malinga: Pollard
'బౌలింగ్​లో మలింగ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు'
author img

By

Published : Oct 19, 2020, 1:25 PM IST

శ్రీలంక పేసర్​ లసిత్​ మలింగ బౌలింగ్​ వారసత్వాన్ని ముంబయి ఇండియన్స్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా కొనసాగిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో బుమ్రా మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు సహకరించాడని అన్నాడు.

"బుమ్రా వరల్డ్​ క్లాస్​ క్రికెటర్​. కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో నంబర్​వన్​గా కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్​ జట్టులో చేరాక ఎన్నో విషయాలను నేర్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగాడు. బుమ్రా మా జట్టుకు తగిన వాడు. లసిత్ మలింగ​ నుంచి బౌలింగ్​ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. పంజాబ్​తో మ్యాచ్​లో మేము చాలా బాగా బ్యాటింగ్​ చేసినా.. చివరికి పరాజయం ఎదురైంది. కానీ, ప్రతిమ్యాచ్​కూ మెరుగవుతూ వస్తున్నాం. తర్వాత జరగబోయే మ్యాచ్​ కోసం కొత్త ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది."

- పొలార్డ్​, ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​ మొదటి సూపర్​ఓవర్​లో బ్యాటింగ్​కు దిగిన కెప్టెన్​ రోహిత్​ శర్మ, క్వింటన్​ డికాక్​ ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. రెండో సూపర్​ ఓవర్​లో బరిలో దిగిన పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా కలిసి 11 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.