కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. అయితే తాను ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపాడు అశ్విన్. స్కానింగ్ రిపోర్టు సానుకూలంగా ఉందని చెప్పాడు. నొప్పి తీవ్రత తగ్గినట్లు వెల్లడించాడు.
"పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా మైదానాన్ని వీడా. ఇప్పుడు ఆ నొప్పి తీవ్రత తగ్గింది. స్కానింగ్ రిపోర్ట్ సానుకూలంగా వచ్చింది. నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు"
-అశ్విన్, దిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో ఆరో ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ కేవలం రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవర్ చివరి బంతికి మ్యాక్స్‌వెల్ కొట్టిన సింగిల్‌ను కాపాడటానికి డైవ్ చేశాడు అశ్విన్. అపుడు అతడి ఎడమ చేయి నేరుగా నేలను తాకగా.. శరీర బరువంతా దానిపై పడింది. వెంటనే అశ్విన్ చేయి పట్టుకుని బాధతో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి అతణ్ని బయటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో భుజంపై ఐస్ ప్యాక్‌తో కనిపించాడు అశ్విన్. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఫలితంతో విజయం సాధించింది దిల్లీ.
అయితే ఈ గాయం తీవ్రత చూశాక అశ్విన్ టోర్నీ మొత్తానికి దూరమవుతాడని అందరూ భావించారు. ప్రస్తుతం అతడు చెప్పినదాన్ని బట్టి చూస్తే తర్వాత మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.