ETV Bharat / sports

'ఆ వేగం వెనుక రెండేళ్ల కృషి ఉంది' - Anrich and shikhar talks

దిల్లీ కాపిటల్స్ పేసర్ ఎన్రిచ్​ నోకియా ఐపీల్​ చరిత్రలోనే అత్యంత వేగమైన బాల్ వేసి రికార్డు సృష్టించాడు. దీనిపై స్పందించిన ఎన్రిచ్.. ఆ బంతిని అంత వేగంగా విసరడానికి తాను కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నానని చెప్పుకొచ్చాడు.

Anrich Nortje_IPL
ఆ వేగం వెనుక రెండేళ్ల కృషి ఉంది: అన్రిచ్​ నోర్జే
author img

By

Published : Oct 15, 2020, 4:51 PM IST

Updated : Oct 15, 2020, 6:03 PM IST

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో అత్యంత వేగమైన బంతి విసిరిన దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ఎన్రిచ్ నోకియా ఐపీఎల్​లో రికార్డు సృష్టించాడు. తన మొదటి ఓవర్​లోనే గంటకు 156.22 కి.మీ వేగంతో బంతిని విసిరి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. బంతిని వేగంగా విసరడానికి తాను రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు.

"ఐపీఎల్​లో నేను వేగమైన బంతిని విసిరానని నాకు తెలియదు. కానీ, అందుకోసం నేను చాలా ప్రయత్నించా. సరైన లెంగ్త్​లో బౌలింగ్​ చేయడం చాలా ముఖ్యం. బట్లర్ క్రీజులో ఉన్నప్పుడు బౌలింగ్​ చేయడం చాలా ఆసక్తిగా ఉంటుంది. నా బౌలింగ్​లో స్కూప్​ షాట్స్ బాగా ఆడాడు. నేను అంత వేగంగా బంతిని విసిరినా బట్లర్​ దాన్ని ఫేస్​ చేయడం ఆశ్చర్యం కలిగించింది."

-ఎన్రిచ్ నోకియా, దిల్లీ బౌలర్

ఎట్టకేలకు తన బలాన్ని నమ్ముకుని బంతిని విసిరిన ఎన్రిచ్.. రాజస్థాన్​ ఆటగాడు బట్లర్​ను అదే ఓవర్లో ఔట్​ చేశాడు. ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​పై దిల్లీ కాపిటల్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది.

ఇదీ చదవండి:ఐపీఎల్​లో వేగవంతమైన బంతి.. అన్రిచ్ రికార్డు

Last Updated : Oct 15, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.