ETV Bharat / sports

బ్యాటింగ్​కు పిచ్​ అనుకూలంగా లేదు: స్మిత్

అబుదాబి వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్ ఘన విజయం సాధించింది. అనంతరం మాట్లాడిన రాజస్థాన్​ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్.. బ్యాటింగ్​కు పిచ్​ అనుకూలంగా లేదని తెలిపాడు.

CSK VS RR
బ్యాటింగ్​కు పిచ్​ అనుకూలంగా లేదు: స్మిత్
author img

By

Published : Oct 20, 2020, 5:01 AM IST

Updated : Oct 20, 2020, 6:29 AM IST

పవర్​ ప్లేలో ఉత్తమ బౌలింగ్​ ప్రదర్శన ద్వారా చెన్నై బ్యాట్స్​మెన్​ను తక్కువ పరుగులకే కట్టడి చేశామని కెప్టెన్​ స్టీవ్​ స్మిత్ అన్నాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్​లో సీఎస్కే జట్టుపై రాజస్థాన్​ గెలిచిన అనంతరం స్మిత్ మాట్లాడాడు.

" బ్యాటింగ్​కు అబుదాబి పిచ్​ అనుకూలంగా లేదు. కానీ, ఈ విజయం ఆనందాన్నిచ్చింది. స్పిన్నర్లు బౌలింగ్​ చేసిన తీరు హర్షనీయం. చక్కటి లెంగ్త్​లలో బంతిని విసిరారు. ఛేదనలో బట్లర్​ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాకు ఒత్తిడి లేకుండా చేశాడు".

-స్టీవ్ స్మిత్, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్

తన ఎల్​బీడబ్యూ రివ్యూ గురించి మాట్లాడిన స్మిత్​.. బంతి తన బ్యాట్​కు తగిలిందన్న విషయం ఉపశమనం ఇచ్చిందని గుర్తుచేశాడు. ప్రస్తుతం మ్యాచ్​ జరిగిన మైదానం బ్యాటింగ్​కు కాస్త ఇబ్బందిగా ఉందని తెలిపాడు. యువ ఆటగాళ్లలో తెవాతియా, శ్రేయస్​ గొప్పగా ఆడుతున్నారని కొనియాడాడు.

ఈ మ్యాచ్​లో చెన్నై జట్టుపై రాజస్థాన్​ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ 17.3​ ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.

ఇదీ చదవండి:సీఎస్కేపై రాజస్థాన్​ ఘన విజయం

Last Updated : Oct 20, 2020, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.