ETV Bharat / sports

అతడికి కెప్టెన్సీ ఇస్తే మరో రోహిత్​ అవుతాడు! - కోల్​కతా నైట్​ రైడర్స్​ కెప్టెన్​గా శుభమన్​ గిల్​

కోల్​కతా నైట్​ రైడర్స్​కు​ శుభమన్​ గిల్​ను కెప్టెన్​గా చేయాలని​ కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా సూచించాడు. ప్రస్తుతం సారథిగా ఉన్న మోర్గాన్​ను వదులుకోవాలని అన్నాడు. వచ్చే ఏడాది మార్చి - మే మధ్య 14వ సీజన్​ నిర్వహించే అవకాశముంది.

Gill
గిల్
author img

By

Published : Nov 23, 2020, 5:17 PM IST

వచ్చే ఐపీఎల్​ సీజన్​లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్​గా శుభ్‌మన్ గిల్‌ను నియమించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్, రసెల్​, వరుణ్ చక్రవర్తిలను సదరు ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవాలని సూచించాడు. గత మూడేళ్ల ​నుంచి కోల్​కతాకు ఆడుతున్న గిల్.. 41 మ్యాచుల్లో 939 పరుగులు చేశాడు.

"దిల్లీ క్యాపిటల్స్.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ చేసినట్లుగానే కోల్‌కతా గిల్​ను భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దాలి. అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని భావిస్తే సారథిగా నియమించడం మంచిది. మరో జట్టు గిల్​ను తీసుకుంటే కష్టమైపోతుంది. ముంబయికి రోహిత్ విజయాలను అందిస్తున్నట్లుగానే.. గిల్ కూడా కోల్‌కతాను విజయాల బాట పట్టిస్తాడు"

-ఆకాశ్​చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్‌నూ కోల్​కతా వదులుకోవాలని.. ఇలా చేస్తే భారీ మొత్తంలో ఫ్రాంచైజీకి డబ్బు మిగులుతుందని చోప్రా తెలిపాడు. ఈసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన మోర్గాన్​ను కూడా వదులుకోవాలని సూచించాడు. జట్టుకు అతడి అవసరం తప్పదని భావిస్తే తిరిగి కొనుగోలు చేయాలని చెప్పాడు.

ఇదీ చూడండి

గంభీర్ రికార్డు తిరగరాసిన శుభ్​మన్

'ఓపెనర్​గా పృథ్వీ కాదు శుభ్​మన్​కే నా ఓటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.